AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పోస్టుమార్టం వద్దంటూ.. భూజంపై మృతదేహంతో పరుగులు! తర్వాత ఏం జరిగిందంటే..

అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించవద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి..

Telangana: పోస్టుమార్టం వద్దంటూ.. భూజంపై మృతదేహంతో పరుగులు! తర్వాత ఏం జరిగిందంటే..
Telangana News
Srilakshmi C
|

Updated on: Jan 14, 2023 | 10:00 AM

Share

అనుమానాస్పద రీతిలో మృతి చెందిన వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దంటూ బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం మతదేహాన్ని భుజంపై వేసుకుని పరుగులు తీశాడు ఓ వ్యక్తి. పోలీసులు అతన్ని వెంబడించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన జడల మల్లయ్య (65) అనే వ్యక్తి గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి నిద్రపోయాడు. ఐతే శుక్రవారం తెల్లవారుజామున భర్త మృతి చెంది ఉండడాన్ని ఆయన భార్య చంద్రవ్వ గమనించింది. ఇక చేసేదిలేక కుటుంబసభ్యులు ఉదయం అంత్యక్రియలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం సిరిసిల్లకు తరలించాలని సూచించారు. అందుకు మల్లయ్య కుటుంబసభ్యులు నిరాకరించారు. ఇంతలో మల్లయ్య సోదరుడి కుమారుడు రాజు మృతదేహాన్ని భుజంపై వేసుకుని మల్లయ్య గుండెపోటుతో మృతి చెందాడని, ఆయన మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదంటూ శ్మశానవాటిక వైపు పరుగులు తీశాడు. ఐతే పోలీసులు ఆయన్ని వెంబడించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మల్లయ్య మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సాంబశివరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ