Sharad Yadav Funeral Today: కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్‌కు నేడు తుది వీడ్కోలు.. సొంతూరులో అంతిమయాత్ర
జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75) అంత్యక్రియలు శనివారం (జనవరి 14) జరగనున్నాయి. మధ్యప్రదేశ్ నర్మదాపురం జిల్లాలోని ఆయన సొంతూరులో..
జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (75) అంత్యక్రియలు శనివారం (జనవరి 14) జరగనున్నాయి. మధ్యప్రదేశ్ నర్మదాపురం జిల్లాలోని ఆయన సొంతూరు అంఖ్‌మౌలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు సమాచారం. శరద్ యాదవ్ గురువారం గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పలు పార్టీలకు చెందిన నేతలు శుక్రవారం ఢిల్లీ ఛతర్‌పూర్‌లోని శరద్ యాదవ్ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవి తదితరులు శరద్ యాదవ్‌కు నివాళులర్పించారు.
శరద్ యాదవ్ ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్, ఉత్తరప్రదేశ్‌లోని బదయున్, బీహార్‌లోని మాధేపుర ఇలా మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికై శరద్ యాదవ్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కీలకపాత్రపోషించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.