TSPSC Group 1 Prelims Results: సంక్రాంతికి ముందే తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 12, 2023 | 12:29 PM

టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడికి బుధవారం హైకోర్టు అనుమతి తెలిపింది. స్థానికత వివాదం నేపథ్యంలో ఓ అభ్యర్థి దాఖలు చేసిన అప్పీలుపై జనవరి 11న హైకోర్టు..

TSPSC Group 1 Prelims Results: సంక్రాంతికి ముందే తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు
TSPSC Group 1 Prelims Results

టీఎస్పీయస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడికి బుధవారం హైకోర్టు అనుమతి తెలిపింది. స్థానికత వివాదం నేపథ్యంలో ఓ అభ్యర్థి దాఖలు చేసిన అప్పీలుపై జనవరి 11న హైకోర్టు విచారించింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని హైకోర్టు తెల్పింది. ఈలోపు ఫలితాలు వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ ఫలితాలు సంక్రాంతికి ముందే వెలువడనున్నాయి.

కాగా 503 గ్రూప్‌-1 సర్వీసుల గతేడాది అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు కు 2,85,916 మంది హాజరయ్యారు. నవంబరు 15న ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను 1:50 నిష్పత్తిలో ప్రకటించనుంది. మొత్తం 150 మార్కుల్లో 5 ప్రశ్నలను తొలగించగా 145 ప్రశ్నలకు వచ్చిన మార్కులను 150 మార్కులకు దామాషా పద్ధతిలో లెక్కించి, మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు ఫలితాలను వెలువరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu