Jalebi Baba: భక్తి ముసుగులో వికృతచేష్టలు.. 120 మందిపై అత్యాచారం కేసులో జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్ష

ఆధ్యాత్మిక ముసుగులో దాదాపు 120 మహిళలపై అకృత్యాలకు పాల్పడిన జిలేబీ బాబా అలియాస్‌ అమర్‌పురి (బిల్లు)కి కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హర్యాణాలో సంచలనం రేపిన ఈ కేసులో నిందితుడికి ఎట్టకేలకు శిక్ష పడింది..

Jalebi Baba: భక్తి ముసుగులో వికృతచేష్టలు.. 120 మందిపై అత్యాచారం కేసులో జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్ష
Haryana Jalebi Baba
Follow us

|

Updated on: Jan 12, 2023 | 7:29 AM

ఆధ్యాత్మిక ముసుగులో దాదాపు 120 మహిళలపై అకృత్యాలకు పాల్పడిన జిలేబీ బాబా అలియాస్‌ అమర్‌పురి (బిల్లు)కి కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హర్యాణాలో సంచలనం రేపిన ఈ కేసులో నిందితుడికి ఎట్టకేలకు శిక్ష పడింది. తానని తాను మహిమలున్న బాబాగా పరిచయం చేసుకుని తాంత్రిత విద్యల పేరిట తన వద్దకు వచ్చిన మహిళలకు మత్తుమందు ఇచ్చి.. ఆపై అత్యాచారాలకు పాల్పడేవాడు. అనంతరం వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేసేవాడు. అంతటితో ఆగకుండా తనతో సంబంధం పెట్టుకోవాలని పదేపదే వేధించేవాడు. అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో జిలేబీ బాబా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఈ కేసును విచారించిన ఫతేహాబాద్‌ జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు అతడిని దోషిగా తేల్చి, శిక్షతో పాటు రూ.35 వేలు జరిమానా విధించింది.

పంజాబ్‌లోని మాన్సా్కు చెందిన జిలేబీ బాబా (63) అసలుపేరు అమర్‌వీర్‌. అతనికి బిల్లూరామ్‌ అనే మరో పేరు కూడా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం భార్యతో సహా హరియాణాకు వచ్చిన అమర్‌పురి తహానా రైల్వే రోడ్డులో జిలేబీ దుకాణం తెరిచాడు. కొన్నాళ్లకు భార్య మృతి చెందింది. రెండేళ్ల తర్వాత తోహానాలో జిలేబీ బాబాగా అవతారమెత్తి తంత్రిక విద్యలు తెలుసునని, దెయ్యాలు వదిలిస్తానని నమ్మబలికాడు. అనతికాలంలోనే జనాల దృష్టిని ఆకర్షించాడు. అతని వద్దకు వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండేవారు. అతని మాయమాటలు నమ్మిన కొందరు మహిళలను లొంగదీసుని, మత్తుమందు మందు ఇచ్చి అకృత్యాలకు పాల్పడేవాడు. ఆ వికృత చేష్టలను మరొకరి సాయంతో మొబైల్‌ ఫోన్లతో రికార్డు చేసేవాడు.

ఈ క్రమంలో 2018లో ఓ మహిళ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫతేహాబాద్ జిల్లాలోని తోహానాలో ఉన్న జిలేబీబాబా నివాసంపై దాడి చేయగా..120కి పైగా వీడియోలు, మత్తుపదార్ధాలు దొరికాయి. అనంతరం మరికొందరు మహిళలు కూడా ఫిర్యాదు చేయడంతో జిలేబీ బాబాపై విచారణ ప్రారంభించారు. నేరాలు రుజువుకావడంతో నిందితుడిని పలు సెక్షన్ల కింద పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇన్నాళ్లకు కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.