Suo Motu Case: నిండు చూలాలికి దక్కని వైద్యం.. తల్లీబిడ్డా మృతిచెందిన ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హై కోర్టు

నాగర్ కర్నూల్‌లో చోటుచేసుకున్న తల్లీ, బిడ్డ మృతి హృదయవిదాయక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన పై తెలంగాణ హై కోర్టు సీరియస్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

Suo Motu Case: నిండు చూలాలికి దక్కని వైద్యం.. తల్లీబిడ్డా మృతిచెందిన ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హై కోర్టు
TS High Court
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 11, 2023 | 11:11 AM

ప్రసవం చేసేందుకు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఓ తల్లి నరకయాతన అనుభవించింది. దాదాపు 180 కిలోమీటర్లు మోసుకెళ్లినా తల్లి, కడుపులోని బిడ్డ చేతికి చిక్కలేదు. నాగర్ కర్నూల్‌లో చోటుచేసుకున్న ఈ హృదయవిదాయక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన పై తెలంగాణ హై కోర్టు సీరియస్ అయ్యింది. అసలేం జరిగిందంటే..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా, వంకేశ్వరం గ్రామానికి చెందిన స్వర్ణ అనే మహిళకు డిసెంబర్‌ 27న రాత్రి 8 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు స్వర్ణను స్థానికంగా ఉన్న పదర హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఐతే అక్కడ వైద్యులు లేకపోవడంతో అమ్రాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ కూడా సరైన సదుపాయాలు లేకపోవడంతో అచ్చంపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలా దాదాపు మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా.. ఎక్కడా కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీ స్త్రీ పరిస్థితి మరింత విషమించింది. అచ్చంపేట నుంచి నాగర్ కర్నూలు జిల్లా వైద్య కేంద్రానికి రాత్రి 11 గంటల 45 నిముషాలకు 108 వాహనం ద్వారా తరలించారు. సుమారు 180 కిలోమీటర్లు వచ్చిన తరువాత స్వర్ణ మగ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. తల్లి చనిపోయిన కొద్దిసేపటికే పుట్టిన బిడ్డ కూడా మృతి చెందింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లనే తల్లి బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసును రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

ఇవి కూడా చదవండి

తాజాగా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?