Telangana: హైదరాబాద్‌ చేరుకున్న కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్.. ఆదిలోనే షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణిక్‌రావు థాక్రే తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న థాక్రేకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలంతా ఘన స్వాగతం పలికారు.

Telangana: హైదరాబాద్‌ చేరుకున్న కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్.. ఆదిలోనే షాక్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
Manikrao Thakare
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 11, 2023 | 11:04 AM

కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన మాణిక్‌రావు థాక్రే తొలిసారి హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న థాక్రేకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలంతా ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా గాంధీభవన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మాణిక్‌రావు థాక్రే.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్ర, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహతో వేర్వేరుగా భేటీ అవుతారు.

ఎయిర్‌పోర్టులో వీహెచ్ ఆందోళన..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆందోళన చేపట్టారు. థాక్రేకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన వీహెచ్‌ను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారు. దాంతో ఆగ్రహించిన వీహెచ్.. సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత విషయం తెలుసుకున్న ఇతర నేతలు అక్కడికి రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇవి కూడా చదవండి

ఎంపీ కోమటిరెడ్డికి థాక్రే ఫోన్..

హైదరాబాద్‌లో దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జ్‌ మాణిక్‌ రావు థాక్రే వెంటనే యాక్షన్‌లోకి దిగారు. అసంతృప్తిలో ఉన్న సీనియర్‌ లీడర్లకు ఫోన్లు చేస్తున్నారు. మొదటగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్‌ చేశారు. గాంధీభవన్‌కు రావాలని ఆహ్వానించారు. అయితే మాణిక్‌ వినతిని తిరస్కరించిన కోమటిరెడ్డి గాంధీభవన్‌ బయటే కలుస్తానని తేల్చి చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్‌ను గాడిన పెట్టేనా?

కాగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యవస్థంగా మారింది. పార్టీలో ఎవరికి వారే టాప్ లీడర్లు అని భావిస్తూ, పంతాలకు పోవడం వల్ల పరిస్థితి ఆగమాగం ఉంది. కేడర్ ఉన్నా.. లీడర్స్ సరిగా లేకపోవడంతో అధికారం కల్లగానే మారింది. అయితే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు రెండుసార్లు ఇంఛార్జీలను మార్చింది పార్టీ అధిష్టానం. మొదట కుంతియా ఉండగా.. ఆయన స్థానంలో మాణిక్యం ఠాగూర్‌ను నియమించారు. అయన కూడా నేతలను ఏకతాటిపైకి తీసుకురాలేకపోయారు. చివరకు సీనియర్ నేతల అసమ్మతి ఎక్కువ అవడంతో.. ఆయన సైతం తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మాణిక్‌రావు థాక్రే నూతన ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. థాక్రే నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనుంది తెలంగాణ కాంగ్రెస్. మహారాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్‌గా పని చేసిన థాక్రేకి కూసింత రాజకీయ అనుభవం ఎక్కువేనట. మరి థాక్రే అయినా తెలంగాణ కాంగ్రెస్‌ను గాడిన పెడతారా? ముఖ్య నాయకులతో థాక్రే ముఖాముఖి ఫలిస్తుందా? లేక పాత కథలాగే ఫిర్యాదుల పరంపరంతో కాలం గడిచిపోతుందా? ఏం జరుగనుంది? అనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..