Santosh Sobhan: నాకు ప్రభాస్ అన్నకు మధ్య ఉన్న బంధం అదే.. ఆయన ప్రేమ దక్కడం నా అదృష్టం.. సంతోష్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నాడు సంతోష్. ఆయన నటించిన కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఇందులో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది.

Santosh Sobhan: నాకు ప్రభాస్ అన్నకు మధ్య ఉన్న బంధం అదే.. ఆయన ప్రేమ దక్కడం నా అదృష్టం.. సంతోష్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Prabhas, Santhosh Shoban
Follow us

|

Updated on: Jan 11, 2023 | 8:54 AM

పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సంతోష్ శోభన్. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నాడు సంతోష్. ఆయన నటించిన కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఇందులో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. సంక్రాంతి పండుగకు ఈ నెల 14న “కళ్యాణం కమనీయం” విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు సినిమాలో నటించిన అనుభవాలు తెలిపారు హీరో సంతోష్ శోభన్.

సంతోష్ మాట్లాడుతూ.. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసుకోవాలనేది నా కల. అది ఈ చిత్రంతో తీరుతోంది. బిగ్ స్టార్స్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇది బిగ్ సంక్రాంతి ఫర్ టాలీవుడ్ అనుకుంటున్నాను. నేనైతే రిలీజ్ ప్రకారం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు చిత్రాలు చూస్తాను. వీటితో పాటు నా సినిమా కాబట్టి “కళ్యాణం కమనీయం” మరింత స్పెషల్ అనుకుంటా. నాన్న దర్శకత్వంలో ప్రభాస్ అన్న నటించిన వర్షం సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అయ్యింది. ఇవన్నీ కో ఇన్సిడెంటల్ గా మా మూవీకి కలిసొచ్చాయి అన్నారు.

అలాగే నేను ఇప్పటిదాకా చేసిన సోషల్ కామెడీ మూవీస్ లో నా పాత్రలు రియాల్టీకి కొంత దూరంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో నేను చేసిన శివ క్యారెక్టర్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇందులో ఫేక్ నెస్ లేదు. ఆ సిట్యువేషన్ కు తగినట్లు శివ క్యారెక్టర్ నిజాయితీగా రెస్పాండ్ అవుతుంది. మనం బాగా నటిస్తున్నామనే అప్రిషియేషన్ కోసం ప్రయత్నిస్తే ఆ నటనలో జెన్యూనిటీ పోతుంది. ఆ క్యారెక్టర్ గానే ప్రవర్తించాను.  ఇందులో శృతి జాబ్ చేస్తుంది శివకు ఉద్యోగం ఉండదు. అయితే ఇదొక్కటే కథలో కీలకం కాదు. ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితంలో ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా ముందుకు సాగారు అనేది చూపిస్తున్నాం. రెగ్యులర్ ఫార్మేట్ సినిమా కొలతలు “కళ్యాణం కమనీయం” లో ఉండవు. ఈ సినిమా ఒక ఎక్సీపియరెన్స్ లా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లైఫ్ అంటే ఒకరి మీద మరొకరం ఆధారపడటం. నాన్న మాకు దూరమైనప్పుడు అమ్మ మమ్మల్ని ఏ కష్టం తెలియకుండా పెంచింది. అప్పుడు అమ్మ మీద ఆధారపడ్డాను. లైఫ్ లో ఒక సందర్భం వస్తే భార్య సంపాదన మీద భర్త కొంతకాలం లైఫ్ లీడ్ చేస్తాడు. అది వాళ్లిద్దరికి మధ్య సమస్య. భార్యా భర్తలకు ఇష్టమైతే వాళ్ల జీవితాన్ని ఎలాగైనా గడుపుతారు. నేను నిజ జీవితంలో జాబ్ లేకుంటే బాధపడాలి. నేను ఆ క్యారెక్టర్ లో నటిస్తున్నా కాబట్టి పర్సనల్ గా తీసుకోలేదు.  ప్రభాస్ అన్న నాకు ఇచ్చే సపోర్ట్ గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్. నా గత చిత్రాల ప్రమోషన్ కు సపోర్ట్ చేశారు. ఈ సినిమా పాట రిలీజ్ చేస్తున్నారు. నేను ఆయన అభిమానిని. మా మధ్య ఉన్నది అభిమాని, స్టార్ మధ్య ఉన్న బంధం. ప్రభాస్ అన్న ప్రేమ దక్కినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అని చెప్పుకొచ్చాడు.