RRR: లాస్‌ఏంజిల్స్‌ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల ప్రదానంలో ఆర్ఆర్ఆర్ హవా.. ఆ క్యాటగిరిలో దక్కిన అవార్డు

ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల ప్రధానంలో సత్తా చాటింది. 2 కేటగిరీల్లో అవార్డ్‌ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో నామినేట్ అయ్యింది.

RRR: లాస్‌ఏంజిల్స్‌ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల ప్రదానంలో ఆర్ఆర్ఆర్ హవా.. ఆ క్యాటగిరిలో దక్కిన అవార్డు
Rrr
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 11, 2023 | 7:38 AM

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల ప్రధానంలో సత్తా చాటింది. రెండు కేటగిరీల్లో అవార్డ్‌ కోసం పోటీ పడింది ఆర్ఆర్ఆర్. బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు.. నాటు..’ నామినేట్ అయ్యింది. కాగా బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ విన్ అయ్యింది. బెస్ట్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ కు అవార్డు లభించింది. మరికాసేపట్లో బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో విన్నర్ ను అనౌన్స్ చేయనున్నారు. బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో మొత్తం 5 సినిమాలు నామినేట్ అయ్యాయి.. వీటల్లో ఆర్ఆర్ఆర్ వైపే అందరి దృష్టీ ఉంది.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి జపాన్‌లోనూ ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఇప్పుడు అమెరికా అవార్డ్స్‌ రేస్‌లోనూ ఆర్ఆర్ఆర్ ఉండటం తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం. 2022 మార్చి 24న రిలీజ్‌.. వరల్డ్‌వైడ్‌ రూ.1200 కోట్ల కలెక్షన్‌స్ సాధించింది.  దేశభక్తి కథతో వచ్చిన ట్రిపుల్‌ ఆర్‌కి విపరీతమైన క్రేజ్ లభించింది.  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు లీడ్‌రోల్స్‌ చేసిన మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

అయితే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్ అంటే అది ఆస్కార్‌కు ఎంట్రీ లాంటిది అంటుంటారు.. ఇవాళ ఇక్కడ దర్శకధీరుడు రాజమౌళి సినిమాకి పురస్కారం లభించడంతో ఆస్కార్‌ అంచనాలూపెరిగిపోయాయి. అలాంటి ఆస్కార్స్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ గెలవాలంటూ బాలీవుడ్‌ స్టార్స్‌ కూడా చాలా మంది విష్‌ చేస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు. ఈ ఊపులో ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్‌ కూడా తన ఖాతాలో వేసుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో