Rashmika Mandanna: క్యూట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన రష్మిక ముద్దుపేరు ఏంటో తెలుసా.?
కన్నడ ఇండస్త్రీనుంచి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోన్న ముద్దుగుమ్మల లిస్ట్ లో ముందు వరసలో ఉన్నారు రష్మిక మందన్న. కన్నడ ఇండస్త్రీనుంచి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రష్మిక. ఆ తర్వాత తెలుగులో చలో సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత గీతగోవిందం సినిమా తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది ఈ బ్యూటీ. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. అయితే రష్మిక అందానికి, అభినయానికి పడిపోని కుర్రకారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి..
రష్మీకను క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ అంటూ ఉంటారు. అయితే ఈ క్యూట్ బ్యూటీ నిక్ నేమ్ ఏంటో తెలుసా..? రష్మికను ఇంట్లో వాళ్ళు ఏమని పిలుస్తారో తెలుసా.? తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదిక అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో మీ నిక్ నేమ్ ఏంటి అని ఆయా అభిమాని ప్రశ్నించగా..




తల్లిదండ్రులు నన్ను మోని లేదా మోవా అని పిలుస్తారు అంటూ రష్మిక మందన్నా పేర్కొంది. మోని అంటే కొడవ భాషలో కుమార్తె అని అర్థం. ఇంట్లో అమ్మానాన్న నన్ను ముద్దుగా మౌని అని పిలుస్తారని తెలిపింది. అలాగే తన తల్లిదండ్రులతో చాలా క్లోజ్ గా ఉంటాను అని తెలిపింది రష్మిక. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం దళపతి విజయ్ సరసన వారసుడు సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నేడు తమిళ నాట రిలీజ్ అవుతోంది. అలాగే తెలుగులో 14 విడుదల కానుంది.