Waltair Veerayya: మేసన్‌ మెగా ఫ్యాన్స్‌ సందడి.. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ హంగామా.. కార్లతో ర్యాలీ

ఈ ఏడాది సంక్రాంతి పండగ కానుకగా తమ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలు. బాక్సాఫీస్ బరిలో పోటీపడుతున్నారు చిరు, బాలయ్యలు.

Waltair Veerayya: మేసన్‌ మెగా ఫ్యాన్స్‌ సందడి.. వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ హంగామా.. కార్లతో ర్యాలీ
Chiru Fans Hunga In Us
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2023 | 7:48 AM

ఇటీవల అమెరికాలో నిర్వహించిన న్యూ ఇయర్‌ పార్టీలో టీడీపీ, నందమూరి అభిమానులు – జనసేన, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య గొడవ జరిగింది. కొట్లాట పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సంక్రాంతి పండగ కానుకగా తమ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణలు. బాక్సాఫీస్ బరిలో పోటీపడుతున్నారు చిరు, బాలయ్యలు.. దీంతో ఇరు హీరోల అభిమానుల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంది. తమ అభిమాన హీరో సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనైనా హిట్ చేయాలని ..వారి వారి సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగిన విధంగా డిఫరెంట్ స్టైల్ లో ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్‌. రెండు సినిమాలకి గ్రాండ్ ఓపెనింగ్స్ ఉంటాయని ‘వాల్తేరు వీరయ్య’ మీడియా సమావేశంలోనూ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాత రవి శంకర్ చెప్పారు. థియేటర్ల సమస్య కూడా ఉండదని అభిమానులు ఎంజాయ్‌ చేయాలని అంతే కానీ గొడవపడకూడదని హితవు పలికారు.

తాజాగా అమెరికాలోని ఓహయో రాష్ట్రం మేసన్‌ సిటీ లో వాల్తేర్ వీరయ్య ప్రి రిలీజ్ హంగామా పేరిట కార్యక్రమం చేశారు చిరంజీవి ఫ్యాన్స్‌. మేసన్ మెగాస్టార్ ఫాన్స్ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. 30 కార్లతో కార్ ర్యాలీ నిర్వహించారు. చిరంజీవి ముద్దు పేరు చిరు అని వచ్చేలా కార్లు పార్కింగ్ చేసి హంగామా చేశారు ఆ డ్రోన్ వీడియో షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

వాల్తేరు వీరయ్య హిట్ కావాలంటూ ఫ్యాన్స్.. చిన్నారి మెగా అభిమానితో కేక్ కట్ చేయించి సందడి చేశారు. ఈవెంట్‌లో మేసన్‌ మెగా ఫాన్స్ కన్వీనర్ విజయ్‌ రేపల్లె, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ కల్యాణ్‌ అడప, కృష్ణ యడ్ల అతని మిత్రులు సందడి చేశారు.

మరిన్ని గ్లోబల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..