AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kaikala satyanarayana: మరో విలక్షణ నటుడిని కోల్పోయిన టాలీవుడ్.. హీరో గా అడుగు పెట్టి.. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిగాంచిన కైకాల

కైకాల సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జర్నీలో మొత్తం 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా  పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హీరోగా, విలన్,  హాస్య,  క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు

kaikala satyanarayana: మరో విలక్షణ నటుడిని కోల్పోయిన టాలీవుడ్.. హీరో గా అడుగు పెట్టి.. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఖ్యాతిగాంచిన కైకాల
Kaikala Satyanarayana
Surya Kala
|

Updated on: Dec 23, 2022 | 9:04 AM

Share

టాలీవుడ్ సీనియర్ నటుడు,  పార్లమెంటు మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణ(87) ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్లకు అంటే 1935  జులై 25న సీతారామమ్మ, లక్ష్మీనారాయణ దంపతులకు కైకాల కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు లోని కౌతరం గ్రామంలో జన్మించారు. తొలి తెలుగు టాకీ సినిమా భ‌క్త‌ప్రహ్లాద 1931 లో రిలీజ్ అయింది. కైకాల ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశారు. గుడివాడ కళాశాల నుండి డిగ్రీ పట్టాను తీసుకున్నారు. సినిమాల మీద ఆసక్తితో మద్రాసు చేరుకున్న ఆయన మొదటి సినిమా ‘సిపాయి కూతురు’. 1959లో విడుదలైంది. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో కైకాల కు వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు పద్మావతి, రమాదేవి, ఇద్దరు కొడుకులు  లక్ష్మీనారాయణ, కేవీ రామారావు ఉన్నారు.

కైకాల సత్యనారాయణ 60 ఏళ్ల సినీ జర్నీలో మొత్తం 777 సినిమాల్లో నటించారు. ఒక నటుడిగా  పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హీరోగా, విలన్,  హాస్య,  క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా కైకాల సత్యనారాయణ  “నవరస నటనా సార్వభౌమ” అనే బిరుదు పొందారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ఒకరు.  పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని (కథాకనాయిక) తండ్రి, తాత మొదలైనవి. అంతేకాదు తన నటనతో ఎస్వీఆర్ ను మెప్పించి ఆయనతో ప్రశసంలు అందుకున్నారు.

సత్యనారాయణ సినీ పరిశ్రమలో మొదట హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమా నిరాశ‌ప‌ర్చ‌డంతో విల‌న్‌గా మారారు. జాన‌ప‌ద బ్ర‌హ్మ విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అనేక జాన‌ప‌ద చిత్రాలతో పాటు సాంఘిక సినిమాలలో కూడా స‌త్య‌నారాయ‌ణ విల‌న్ పాత్ర‌లు పోషించారు.

ఇవి కూడా చదవండి

777 సినిమాల్లో 28 పౌరాణిక చిత్రాలు.. ఎన్టీఆర్ ‘ల‌వ‌కుశ‌’లో  భ‌ర‌తుడిగా.. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో క‌ర్ణుడిగా.. ‘న‌ర్త‌న‌శాల‌’లో దుశ్శాస‌నుడిగా న‌టించారు. ‘పాండవ వనవాసం’లో ఘ‌టోత్క‌చుడి పాత్ర తొలిసారి ధరించారు. మ‌ళ్ళీ 1995లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘ఘ‌టోత్క‌చుడు’ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. ‘శ్రీకృష్ణావ‌తారం’ చిత్రంలో తొలిసారి దుర్యోధ‌నుడి పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత ‘కురుక్షేత్రం’లో దుర్యోధ‌నుడిగా అద్భుతంగా ర‌క్తి క‌ట్టించారు. 51 జానపద చిత్రాల్లో.. 9 చారిత్రక చిత్రాల్లో.. నటించారు. అంతేకాదు 200 మంది దర్శకులతో పనిచేశారు కైకాల.. ఆయన నటించిన.. 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించారు. గజదొంగ, మామా అల్లుళ్ల సవాల్‌,ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు వంటి సినిమాలు నిర్మించారు. కైకాల సత్యనారాయణ నటించిన చివరి చిత్రం మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..