Kaikala Satyanarayana: యముడి పాత్రకు ట్రేడ్‌ మార్క్‌ కైకాల సత్యనారాయణ..

87 ఏళ్ల కైకాల ఆరు దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సేవలందించారు. దాదాపు 770 సినిమాల్లో నటించి మెప్పించారు కైకాల.

Kaikala Satyanarayana: యముడి పాత్రకు ట్రేడ్‌ మార్క్‌ కైకాల సత్యనారాయణ..
Kaikala Satyanarayana
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 23, 2022 | 8:42 AM

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మరో మహానటుడిని కోల్పోయింది తెలుగు ఇండస్ట్రీ. లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. 87 ఏళ్ల కైకాల ఆరు దశాబ్దాలుగా తెలుగు సినిమాకు సేవలందించారు. దాదాపు 770 సినిమాల్లో నటించి మెప్పించారు కైకాల. విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ర‌క‌ర‌కాల పాత్ర‌ల్లో మెప్పించాడు. వ‌యోభారంతో ఇప్పుడు ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు. కానీ కైకాల స‌త్య‌నారాయ‌ణ‌ ఒక‌ప్పుడు ర‌మా ఫిలింస్ అనే బ్యాన‌ర్‌తో సినిమాల‌ను కూడా నిర్మించారు.

ధర్మ పరిరక్షణ ధురంధరుండా.. యముండా అంటూ సత్యనారాయణ చెప్పిన ట్రేడ్ మార్క్ డైలాగ్​ ఇప్పటి ఎవర్‌ గ్రీన్‌. తెర మీద నిండుగా గంభీరంగా కనిపించే ఆయన ఆహార్యం.. కంచులా మోగే స్వరం.. భయానక భీబత్స రసాలను పలికించే నటన… ఇలా యముడి పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలు ఆయనకు జన్మతహా వచ్చాయి. అందుకే యమగోల సినిమాలో యముడి పాత్రకు ఆయనే కావాలని కోరి ఎంచుకున్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ మాస్ యాక్టింగ్‌ తోడు సత్యనారాయణ హుందాతనం తోడై.. యమగోల సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నరుడు, యముడి మధ్య జరిగే పోటా పోటీ సన్నివేశాలతో యమగోల వెండితెర మీద సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్ని కాదు. ఆ సినిమ ఘన విజయం సాధించటానికి యముడి పాత్ర కూడా ఓ ముఖ్య కారణం.

ఇవి కూడా చదవండి

యమగోల సక్సెస్‌ తరువాత యముడి పాత్ర అంటే సత్యనారాయణ మాత్రమే గుర్తొచ్చేలా ప్రేక్షకుల హృదయాల్లో పేటెంట్ హక్కులు పొందారాయన. తనదైన నటనను ప్రదర్శించే పాత్రలు వచ్చిన ప్రతీసారి వెండితెరపై చెలరేగిపోయారు. యమగోల సక్సెస్‌ తరువాత యముడి పాత్ర హిట్ ఫార్మూలాగా మారింది. ఆ తరువాత యమలీల, యముడికి మొగుడు, య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది,రవితేజ దరువు చిత్రాల్లో యముడిగా నటించి యముడి పాత్రకు ట్రేడ్‌ మార్క్‌గా నిలిచిపోయారు.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ