NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తలపడడానికి సై అంటోన్న మిస్టర్ పర్ఫెక్ట్.. టాలీవుడ్‌లోకి అమీర్ ఎంట్రీ..!

జూనియర్ ఎన్టీఆర్‌ కొత్త సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్ 31 అని పేరు పెట్టారు. ఈ సినిమాకు మేకర్స్ జూనియర్ ఎన్టీఆర్‌ తో పోరాడే విలన్ పాత్ర కోసం అమీర్ ఖాన్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమా సెట్స్ పైకి త్వరలో వెళ్లే అవకాశం ఉంది.

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తలపడడానికి సై అంటోన్న మిస్టర్ పర్ఫెక్ట్.. టాలీవుడ్‌లోకి అమీర్ ఎంట్రీ..!
Ntr Aamir Khan
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2023 | 6:43 PM

గత కొంతకాలంగా దక్షిణాది, బాలీవుడ్ సినిమాల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతున్నాయి. టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. దక్షిణాదిలోని అనేకమంది నటులు పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. ఉత్తరాది సినీ ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చాలా మంది బి-టౌన్ స్టార్ హీరోలు సైతం.. దక్షిణాది సినిమాల్లో కనిపించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటీవల RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించనున్నాడు అనే టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. KGF ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తదుపరి చిత్రంలో ఎన్టీఆర్ తో అమీర్ ఖాన్ స్క్రీన్ ను పంచుకోనున్నాడట.. ఇదే విషయంపై అమీర్‌ను సంప్రదించగా  అయితే ఎప్పటి నుంచో ఓ తెలుగు సినిమా చేసేందుకు చూస్తున్న అమీర్.. ఈ సినిమా ఛాన్స్‌ రాగానే ఓకే చెప్పారని బీ టౌన్‌లో కూడా టాక్‌ వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్‌ కొత్త సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్ 31 అని పేరు పెట్టారు. ఈ సినిమాకు మేకర్స్ జూనియర్ ఎన్టీఆర్‌ తో పోరాడే విలన్ పాత్ర కోసం అమీర్ ఖాన్‌ను పరిశీలిస్తున్నారట. ఈ సినిమా సెట్స్ పైకి త్వరలో వెళ్లే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు సినిమా సినిమాకు మధ్య ఎక్కువ సమయం ఇవ్వని యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ట్రిపుల్ ఆర్ తర్వాత మాత్రం షూటింగ్‌కు గ్యాప్  ఇచ్చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనే కారణమో.. లేక తనకు రెస్ట్ కావాలని ఫిక్స్ అయ్యారో తెలియదు కాని కొరటాల సినిమా షూటింగ్‌ను నెలలకు నెలలే పక్కకు పెట్టేశారు. తన ఫ్యామిలీతో.. ఫారెన్లో చెక్కర్లు కొడుతూ.. ఆ ఫోటోలతో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇక తన సినిమా అప్డేట్స్‌ కావాలని బెట్టు చేస్తున్న ఫ్యాన్స్‌కు మాత్రం తాజాగా స్వీట్ సర్‌ ప్రైజ్‌ ఇచ్చేశారు తారక్‌. కొరటాల తో తాను చేయబోయే సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు.. ఓ అనౌన్స్ మెంట్ ఇప్పించారు. ఇక ఈ అనౌన్స్‌ మెంట్ తో ఖుషీ అవుతున్న తారక్‌ ఫ్యాన్స్ కు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న 31వ సినిమా గురించిన వార్తలు  మరింత ఖుషీ నిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..