AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఫన్‌ టూ బిందాస్.. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌ స్టార్స్ వార్.. జనవరి చిత్రాలివే..

ఎన్నో ఆశలతో.. బ్లాక్‌బస్టర్ కలెక్షన్లు రాబట్టాలనే లక్ష్యంతో సినీ ఇండస్ట్రీ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలోకి సూపర్ స్టార్స్ వార్‌కి..

Tollywood: ఫన్‌ టూ బిందాస్.. బాక్సాఫీస్ దగ్గర సూపర్‌ స్టార్స్ వార్.. జనవరి చిత్రాలివే..
Jan Month Releasing Month
Ravi Kiran
|

Updated on: Jan 03, 2023 | 7:00 AM

Share

ఎన్నో ఆశలతో.. బ్లాక్‌బస్టర్ కలెక్షన్లు రాబట్టాలనే లక్ష్యంతో సినీ ఇండస్ట్రీ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలోకి సూపర్ స్టార్స్ వార్‌కి సిద్దమవుతుండగా.. పలువురు యువ హీరోలు కూడా తమ సత్తా చాటేందుకు క్యూ కట్టారు. అలాగే పొంగల్ బరిలోనే కాదు.. నెలాఖరున రిపబ్లిక్ డే సందర్భంగా కూడా రెండు చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి.

మరి అసలు జనవరి నెలలో రిలీజయ్యే చిత్రాలు ఏంటో..

  • వీరసింహరెడ్డి(జనవరి 12): నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహరెడ్డి’. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.
  • వాల్తేరు వీరయ్య(జనవరి 13): మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించాడు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన ఈ మూవీ ఆల్బమ్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఫ్యాన్స్‌ను మెప్పించాయి. ఇక ఈ చిత్రం జనవరి 13 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
  • తునివు(జనవరి 12): తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, హెచ్ వినోత్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ‘తునివు’. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‏గా రూపొందిన ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్. జీ స్టూడియోస్ బ్యానర్‌తో కలిసి నిర్మాత బోనీ కపూర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ కంపోజ్ చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
  • వరిసు(జనవరి 12): తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తో్న్న లేటెస్ట్ చిత్రం ‘వరిసు’. ఇది తెలుగులో వారసుడు పేరుతో విడుదల కానుంది. ఈ మూవీకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్స్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. సంక్రాంతి కానుక జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
  • పఠాన్(జనవరి 25): బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణే హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘పఠాన్’. దీనికి సిద్ధార్ద్ ఆనంద్ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. విడుదలైన ‘బీషరమ్ రంగీ’ సాంగ్ మూవీ చుట్టూ పలు కాంట్రవర్సీలు రేకెత్తించింది. ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీటితో పాటు చిన్న సినిమాలైన సంతోష్ శోభన్ హీరోగా వస్తోన్న ‘కళ్యాణం కమనీయం’ జనవరి 14న, సుదీర్ బాబు హీరోగా నటించిన ‘హంట్’ జనవరి 26న, తమిళ హీరోయిన్ అనైక సురేంద్రన్ ప్రధాన్ పాత్రలో వస్తోన్న ‘బుట్టబొమ్మ’ కూడా జనవరి 26వ తేదీన విడుదలకు సిద్దంగా ఉన్నాయి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..