Samantha: సమంతా.. ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది.? అభిమాని ప్రశ్నకు సామ్‌ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?

2022లో సమంత పేరు ఎంతలా మారుమోగిందే ప్రత్యేకంగా చెప్పాల్సన పనిలేదు. విడాకుల వివాదంతో సామ్‌ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అనంతరం పుష్ప సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో మళ్లీ ఇండస్ట్రీకి రెట్టించిన ఉత్సాహంతో ఎంట్రీ...

Samantha: సమంతా.. ఇప్పుడు మీ జీవితం ఎలా ఉంది.? అభిమాని ప్రశ్నకు సామ్‌ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.?
Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2023 | 5:52 PM

2022లో సమంత పేరు ఎంతలా మారుమోగిందే ప్రత్యేకంగా చెప్పాల్సన పనిలేదు. విడాకుల వివాదంతో సామ్‌ టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అనంతరం పుష్ప సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో మళ్లీ ఇండస్ట్రీకి రెట్టించిన ఉత్సాహంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక విడాకుల నేపథ్యంలో చెలరేగిన వివాదాలు, ట్రోలింగ్స్‌ అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న సమంత అంతలోనే తన హెల్త్‌కి సంబంధించి ఓ వార్త చెప్పి ఫ్యాన్స్‌ను షాక్‌కి గురి చేసింది. అరుదైన వ్యాధి మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించి మరోసారి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఓ వరుస సినిమాలు చేస్తూ మరోవైపు వ్యాధితో పోరాటం చేస్తోంది సామ్‌.

ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే ఓ నెటిజన్‌.. ‘మేడమ్‌ జీ జీవితం ఎలా సాగుతోంది.?’ అని ప్రశ్నించగా దానికి సామ్‌ బదులిస్తూ.. ‘విభిన్నంగా ఉంది’ అంటూ బదులిచ్చింది. దీంతో సామ్‌ చేసిన ఈ కామెంట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు విడాకులు, మరోవైపు అరుదైన వ్యాధి ఇలా వరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామ్‌ తన జీవితం మునపటి కంటే భిన్నంగా ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇక మరో నెటిజన్‌.. ‘మేడమ్‌ మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రతిరోజూ కోరుకుంటున్నాను. మళ్లీ మీరు బాక్సాఫీస్‌ సక్సెస్‌లు అందుకోవాలి. అలాగే విమర్శలను తిరిగి కొట్టాలి’ అని అడగ్గా.. సామ్‌ మాట్లాడుతూ.. ‘మీ ఆశీస్సులు, ప్రార్థనలు నాకెంతో అవసరం. ఇంతకీ ఏం విమర్శలు’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. శాకుంతలం ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడానికి కారణం ఏంటన్న దానికి బదులిస్తూ.. ‘త్వరలో మీరు చూస్తారు కదా’ అంటూ సమాధానం ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్