Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్‌కి 2023 చాలా కీలకం.. జాతీయ స్థాయిలో సత్తా చాటే సినిమాలు వచ్చేస్తున్నాయోచ్‌.

కొత్త ఏడాది టాలీవుడ్‌కు కీలకంగా మారనుంది. ఎన్నో సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటి తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదిలా ఉంటే 2023 కూడా టాలీవుడ్‌కి కీలకంగా మారనున్నట్లు కనిపిస్తోంది. గతేడాది కేవలం..

Tollywood: టాలీవుడ్‌కి 2023 చాలా కీలకం.. జాతీయ స్థాయిలో సత్తా చాటే సినిమాలు వచ్చేస్తున్నాయోచ్‌.
Tollywood 2023
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2023 | 5:20 PM

కొత్త ఏడాది టాలీవుడ్‌కు కీలకంగా మారనుంది. ఎన్నో సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటి తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదిలా ఉంటే 2023 కూడా టాలీవుడ్‌కి కీలకంగా మారనున్నట్లు కనిపిస్తోంది. గతేడాది కేవలం ఒకరిద్దరు స్టార్ హీరోలు మాత్రమే బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. చాలా మంది అగ్ర హీరోలకు 2022 పెద్దగా కలిసిరాలేదు. మరి 2023 టాలీవుడ్‌కు ఎలా ఉండబోతుంది..? కొత్త ఏడాది రాబోయే ఆ భారీ సినిమాలేంటి..? ఎన్ని సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి..? 2023 అప్‌కమింగ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం..

2023లో టాలీవుడ్‌కు మళ్లీ పునర్వైభవం రాబోతుంది. ఎందుకంటే 2022లో ప్రభాస్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలతో పాటు.. రవితేజ, నాని లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా దారుణమైన ఫ్లాపులిచ్చారు. బన్నీ, బాలయ్య లాంటి ఫామ్‌లో ఉన్న హీరోలు రానేలేదు. అయితే 2023 మాత్రం అందరు హీరోల అభిమానులకు పండగే. ఈ ఏడాది దాదాపు అందరు హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో సందడి చేయనుండగా.. 4 నెలలు తిరక్కుండానే ఎప్రిల్ 14న భోళా శంకర్‌గా రాబోతున్నారు. వీరసింహారెడ్డిగా సంక్రాంతికి సై అంటున్న బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాను దసరాకు దించేస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ సినిమా 2023లోనే రాబోతుంది.

మహేష్ బాబు సినిమాను జనవరిలోనే మొదలుపెట్టి.. సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం కొరటాల శివ సినిమాను ఇదే ఏడాది విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ ఇటు ఖుషీతో పాటు.. అటు గౌతమ్ తిన్ననూరి సినిమాలను 2023లోనే తీసుకురానున్నారు. ఆదిపురుష్ జూన్ 16న రాబోతుంటే.. సెప్టెంబర్ 28న సలార్‌ను తీసుకురానున్నారు ప్రభాస్. పవన్ కళ్యాణ్ సైతం సమ్మర్‌లో హరిహర వీరమల్లుతో పాటు వినోదీయ సితం రీమేక్ 2023లోనే విడుదల కానున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ మొదలు కాకపోవడంతో.. 2023లో రావడం కష్టమే. మొత్తానికి ఈ ఏడాది భారీ సినిమాలతో కళకళలాడిపోనుందన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో..
దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు క్రేజీ హీరో..
దేశంలోనే అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌.. ఆమె ఆస్తులు
దేశంలోనే అత్యంత సంప‌న్న మ‌హిళ‌గా సావిత్రి జిందాల్‌.. ఆమె ఆస్తులు
శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. కోటి సదుపాయాలు..
శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ కోటి చెల్లిస్తే.. కోటి సదుపాయాలు..
ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
ఒకే గ్రామంలో ఏకంగా 70 దేవాలయాలు!
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం
గుడ్‌న్యూస్‌..ఈ కారుపై రూ. 65,000 తగ్గింపు, ఉచితంంగా బంగారు నాణెం
సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.
సొగసులో రంభకి.. అందంలో ఉర్వశికి పోటీ ఈ సొగసరి.. సిజ్లింగ్ రిద్ధి.
బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!
బాబర్ అజామ్ సింగల్ హ్యాండ్ క్యాచ్.. వీడియో వైరల్!
అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి
అన్నదాతకు ఎంత కష్టం.. కిడ్నీ రూ.75వేలు..! అవయవాలను అమ్మకానికి
రాజకీయ నాయకురాలితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్..
రాజకీయ నాయకురాలితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ ప్రదీప్..
బాబోయ్‌ బర్డ్‌ఫ్లూ.. హైదరాబాద్‌ నగరంలోకి అడుగుపెట్టేసింది..!
బాబోయ్‌ బర్డ్‌ఫ్లూ.. హైదరాబాద్‌ నగరంలోకి అడుగుపెట్టేసింది..!