Ajith Kumar: అజిత్ కూతురిని ఎప్పుడైనా చూశారా ? అమ్మ అందం , నాన్న ముఖారవిందం.. కలబోసి..

స్టార్‏గా ఎంతో క్రేజ్ ఉన్న అజిత్..బయట మాత్రం ఎంతో సింపుల్ గా కామన్ మ్యాన్ లాగా ఉంటారు. ఇటీవల వాలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో..ఇప్పుడు సంక్రాంతికి తునివు సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు.

Ajith Kumar: అజిత్ కూతురిని ఎప్పుడైనా చూశారా ? అమ్మ అందం , నాన్న ముఖారవిందం.. కలబోసి..
Ajith, Shalini
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2023 | 2:00 PM

తమిళ్ స్టార్ హీరో అజిత్‏కు తెలుగులోనూ యమ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ హీరో సినిమాల కోసం దక్షిణాది సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. స్టార్‏గా ఎంతో క్రేజ్ ఉన్న అజిత్..బయట మాత్రం ఎంతో సింపుల్ గా కామన్ మ్యాన్ లాగా ఉంటారు. ఇటీవల వాలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో..ఇప్పుడు సంక్రాంతికి తునివు సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. తెలుగులో ఈ మూవీ తెగింపు టైటిల్ తో రాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అజిత్ తన కుటుంబంతోకలిసి వెకేషన్ కు వెళ్లారు. తన సతీమణి షాలిని.. కూతురు అనుష్క.. కుమారుడు ఆద్విక్‏లతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అజిత్ కూతురు అనుష్క. ఈహీరో ఫ్యామిలీ సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే వీరికి చెందిన కొన్ని పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు అజిత్ కూతురు ఇలా సోషల్ మీడియాలో కనిపించింది చాలా తక్కువ. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

అజిత్ కూతురు ప్రస్తుతం విదేశాల్లోనే చదువుకుంటుంది. భవిష్యత్తులో ఆమె ప్రొడక్షన్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరీ ఈ వార్తలలో ఎంత వరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ఇక అజిత్ కు ప్రయాణాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బైక్ రైడింగ్ అంటే చెప్పలేనంత ఇష్టం. షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరికినా బైక్ పై దేశమంత చక్కర్లు కొట్టేస్తారు. గతంలోనూ అజిత్ బైక్ పై లడక్ ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే.

Ajith

Ajith

సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించిన తునివు సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అజిత్..డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.