Trisha: త్రిష మనసులో ఉన్న ఆ స్టార్ హీరో.. ఎప్పటికైనా తనతో నటించాలని ఉందంటున్న ముద్దుగుమ్మ..

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్సింగ్ లో త్రిష కెరీర్ టర్న్ అయిందనే చెప్పుకొవాలి. ఇప్పటికే రెండు భారీ ఆఫర్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళ్ స్టార్ విజయ్ దళపతి తదుపరి చిత్రంలో ఆమె కథానాయికగా

Trisha: త్రిష మనసులో ఉన్న ఆ స్టార్ హీరో.. ఎప్పటికైనా తనతో నటించాలని ఉందంటున్న ముద్దుగుమ్మ..
Trisha
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2023 | 9:43 AM

హీరోయిన్ త్రిష. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఫుల్ క్రేజ్ ఉన్న ముద్దుగుమ్మ. కథానాయికగా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నా ఇప్పటికీ తరగని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. చాలా గ్యాప్ తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాతో మరోసారి ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ మూవీ ఎఫెక్ట్.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాకుండా లేటేస్ట్ ఫోటోషూట్స్ అంటూ ఫాలవర్లను ముప్పుతిప్పలు పెడుతుంది. నాలుగు పదుల వయసులోనూ చంద్రబింబం లాంటి మోముతో.. అందాల చూపులతో ఇప్పటి హీరోయిన్లను వెనక్కు నెట్టేస్తుంది. దీంతో ఇప్పుడు ఈ అమ్మడుకు ఆఫర్స్ కూడా క్యూకడుతున్నాయి. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్సింగ్ లో త్రిష కెరీర్ టర్న్ అయిందనే చెప్పుకొవాలి. ఇప్పటికే రెండు భారీ ఆఫర్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళ్ స్టార్ విజయ్ దళపతి తదుపరి చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైనట్లుగా టాక్ వినిపిస్తోంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత వీరు మళ్లీ జోడి కట్టనున్నారు.

ఇదే కాకుండా.. అటు స్టార్ హీరో అజిత్ సినిమాలోనూ త్రిష ఫైనల్ అయినట్లుగా టాక్. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం రాంగీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో త్రిష నటనకు ప్రశంసలు అందుతున్నాయి. జర్నలిస్ట్ గా ఈ సినిమాలో అదరగొట్టింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న త్రిష.. ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. తనను ఇప్పటికీ యువరాణి కుందవైగానే ప్రేక్షకులు చూస్తున్నారని.. కల్కి నవల చదివిన వారికి అందులోని కుందవై పాత్ర పై చాలా పెద్ద ఇమేజ్ ఉంటుందని.. ఆ పాత్రకు తాను సరిపోతానా అన్న సందేహం చాలా మందికి ఉండేదని.. కానీ ఇప్పుడు తానే కుందవై అన్నంతగా ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

తనకు పొన్నియిన్ సెల్వన్ సినిమా పాన్ ఇండియా క్రేజ్ తీసుకువచ్చిందని.. డైరెక్టర్ మణిరత్నం, గౌతమ్ మీనన్, శరవణన్, ప్రేమ్ వంటి దర్శకులతో పనిచేయడం సంతోషంగా ఉన్నారు. అలాగే తనకు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జోడీగా పూర్తిస్థాయి పాత్రలో నటించాలని ఉందని.. ఆయనతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?