- Telugu News Photo Gallery Cinema photos Nayanthara interesting comments about her 20 years journey in film industry telugu cinema news
Nayanthara: నా సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులున్నాయి.. నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు..
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల విడుదలైన కనెక్ట్ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించింది.
Updated on: Jan 02, 2023 | 1:36 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల విడుదలైన కనెక్ట్ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకుంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించింది.

ఈ సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేసిన నయన్.. ఇటీవ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఏడాది పూర్తిస్థాయి బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

అలాగే.. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. చిన్నదా పెద్దదా లేదా పాన్ ఇండియా స్తాయా అని చూడడం లేదు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అందరూ కథ బాగుంటేనే సినిమాను ఆదరిస్తున్నారు. అందుకే కనెక్ట్ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేసాం.

సినీ పరిశ్రమలో 20 ఏళ్ల ప్రయాణం గురించి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు కొనసాగడమంటే చిన్న విషయం కాదు. నా సినీ ప్రయాణంలోనూ ఎన్నో ఒడుదొడుకులున్నాయి. ఇప్పుడు అంతా బాగుంది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. విజయంతోపాటు.. బాధ్యత మరింత పెరుగుతుందని.. నా ప్రమాణాలను ఎప్పటికీ కాపాడుకుంటాను అని చెప్పుకొచ్చింది.

Nayanthara

ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. విజయంతోపాటు.. బాధ్యత మరింత పెరుగుతుందని.. నా ప్రమాణాలను ఎప్పటికీ కాపాడుకుంటాను అని చెప్పుకొచ్చింది.