Sitara Gattamaneni: చిన్నారుల కోసం సూపర్ స్టార్ మరో ముందడుగు.. ‘మహేష్ బాబు ఫౌండేషన్’ అఫీషియల్ వెబ్‏సైట్ స్టార్ట్ చేసిన సితార..

మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉండే ఆయన.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటారు.

Sitara Gattamaneni: చిన్నారుల కోసం సూపర్ స్టార్ మరో ముందడుగు.. 'మహేష్ బాబు ఫౌండేషన్' అఫీషియల్ వెబ్‏సైట్ స్టార్ట్ చేసిన సితార..
Mahesh Babu, Sitara
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2023 | 7:18 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నిజజీవితంలోనూ హీరోనే. ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే ఆయన.. మరోవైపు చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం తనవంతు సాహయం చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు వందలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉండే ఆయన.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటారు. అటు చిన్నారులకు హార్ట్ సర్జరీలు మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ లోని తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని నిజమైన శ్రీమంతుడు అనిపించుకున్నారు. మరోవైపు…రెయిన్ బో, ఆంధ్రా ఆసుపత్రిలతో కలిసి పసి పిల్లల ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు తన సేవా కార్యక్రమాల కోసం కొత్త వెబ్ సైట్ ప్రారంభించారు.

చిన్నారుల కోసం ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్లు మహేష్ తన సితార ఘట్టమనేని తెలిపింది. కొత్త సంవత్సరం రోజున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ… ఈనెల తన పాకెట్ మనీని ఈ ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నానని.. మీరు కూడా మీ వంతు సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. మనందరం కలిసి పిల్లల కోసం మరింత మెరిగైన ప్రపంచాన్ని సృష్టిద్దాం అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇక సోషల్ మీడియాలో సితార ఘట్టమనేనికి ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. చిన్న వయసులోనే ఇంటర్నెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు చిన్న పిల్లల కోసం ఆసక్తికర వీడియోస్ చేస్తూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది సితార. సాంప్రదాయ నృత్యంలోనూ అడుగులు వేస్తుంది. గతంలో మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ ప్రమోషన్ వీడియోలో కనిపించింది సితార.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..