ఆ దేశానికి రాష్ట్రపతి అయిన బీహార్ కూలీ కొడుకు.. ప్రవాసీ భారతీయ వేడుకకు ముఖ్య అతిథి చంద్రికా ప్రసాద్

చంద్రికా ప్రసాద్ తండ్రి బీహార్ లో కూలీగా పనిచేసేవారు. అతను దక్షిణ అమెరికా లోని ఉత్తర భాగాన గల దేశాలలో ఒక చిన్న దేశం సురినామ్‌  చేరుకొని ఓడరేవులో కార్మికుడిగా పనిచేయడం ప్రారంభించాడు.

ఆ దేశానికి రాష్ట్రపతి అయిన బీహార్ కూలీ కొడుకు.. ప్రవాసీ భారతీయ వేడుకకు ముఖ్య అతిథి చంద్రికా ప్రసాద్
chandrikapersad chan santokhi
Follow us
Surya Kala

|

Updated on: Jan 10, 2023 | 12:41 PM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ సమ్మేళన్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్‌ ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్‌ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్‌ ఇర్ఫాన్‌ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ సంతోఖి గత ఏడాది మాత్రమే సురినామ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విదేశాల్లో ఉంటూ భారతదేశం గర్వించేలా చేస్తున్న భారతీయుడిగా ప్రధాని మోడీ మన్ కీ బాత్‌లో పేర్కొన్నారు.

కూలీ కుమారుడి నుంచి రాష్ట్రపతిగా ఆయన ప్రయాణం సురినామ్‌లోని లెలీడోర్ప్‌లో ఫిబ్రవరి 3, 1959న జన్మించిన చంద్రికా ప్రసాద్ సంతోఖి పూర్వీకులు బీహార్‌కు చెందినవారు. చంద్రికా ప్రసాద్ తండ్రి బీహార్ లో కూలీగా పనిచేసేవారు. అతను దక్షిణ అమెరికా లోని ఉత్తర భాగాన గల దేశాలలో ఒక చిన్న దేశం సురినామ్‌  చేరుకొని ఓడరేవులో కార్మికుడిగా పనిచేయడం ప్రారంభించాడు. చంద్రికా ప్రసాద్ తల్లి ఒక షాపులో పని చేసేది. అతనికి తొమ్మిది మంది సోదరులు, సోదరీమణులు ఉన్నారు. 1978లో సంతోఖి నెదర్లాండ్స్‌లోని అపెల్‌డోర్న్‌లోని నెదర్‌లాండ్స్ పొలిటియా అకాడమీలో ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌ను పొందారు. 1982లో అప్లైడ్ రీసెర్చ్‌లో పట్టభద్రుడలయ్యారు. నెదర్లాండ్స్‌లోని పోలీస్ అకాడమీలో నాలుగేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు. 1982లో సురినామ్‌కు తిరిగి వచ్చి పోలీసు శాఖలో పని చేయడం ప్రారంభించారు.

1989లో నేషనల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా, రెండేళ్ల అనంతరం 1991లో పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005లో న్యాయ, పోలీసు శాఖ మంత్రిగా పనిచేసి 2011లో ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.  చంద్రికా ప్రసాద్ సంతోఖి 19 జూలై 2020న వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

సంస్కృతంలో ప్రమాణం:  గత ఏడాది జూలైలో.. నేషనల్ అసెంబ్లీ మాజీ న్యాయశాఖ మంత్రి, ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ (PRP) నాయకుడు సంతోఖిని సురినామ్‌ దేశానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లాటిన్ అమెరికా దేశమైన సురినామ్ అధ్యక్షులుగా చంద్రికా ప్రసాద్ సంతోఖి ఎన్నికైనప్పుడు.. చంద్రికా ప్రసాద్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అప్పట్లో అది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

దాదాపు 6 లక్షల జనాభా ఉన్న సురినామ్‌లో 27.4 శాతం మంది భారతీయులున్నారు. ప్రెసిడెంట్ సంతోఖి పార్టీ భారతీయ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒకప్పుడు అక్కడ యునైటెడ్ హిందుస్థానీ పార్టీగా పిలువబడింది.

ఆర్థిక సంక్షోభం నుంచి ఆ దేశాన్ని గట్టెక్కించడమే సవాల్ 61 ఏళ్ల సంతోఖి ఆర్థిక వ్యవస్థను కుదేలైన దేశాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత జాతీయ అసెంబ్లీలో ఆయన ఇదే అంశాన్ని లేవనెత్తారు. సురినామ్ ఆర్థిక పతనాన్ని ఎదుర్కొంటుందని.. ఇప్పుడు తన ప్రభుత్వం దేశాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి కొత్త విధానాలను రూపొందిస్తుందని అన్నారు.

సురినామ్ ఆర్థిక వ్యవస్థ బాక్సైట్, చమురు నిల్వలపై ఆధారపడి ఉంది, అయితే దేశం గత కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. ప్రస్తుతానికి సంతోఖికి ఇదే అతిపెద్ద సవాల్.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
జోస్ బట్లర్‌కు భారీ ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందంటే?
జోస్ బట్లర్‌కు భారీ ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందంటే?
గరిష్ట స్థాయికి చేరుకున్న భారతదేశ వ్యాపార కార్యకలాపాలు..
గరిష్ట స్థాయికి చేరుకున్న భారతదేశ వ్యాపార కార్యకలాపాలు..
Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
Shreyas Iyer: అదరగొట్టిన అయ్యర్.. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
దండిగా లాభాలను ఇస్తున్న వెండి.. ఆ విషయంలో బంగారంతో పోటీ..!
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
మిమ్మల్ని యంగ్ గా ఉంచే మ్యాజిక్ టీ..
మిమ్మల్ని యంగ్ గా ఉంచే మ్యాజిక్ టీ..
పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
పల్లెవెలుగు బస్‌‌లో ఉరి వేసుకున్న యువకుడు
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా