Sankranti 2023: మకర సంక్రాంతి విశిష్టత.. ఈ రోజున ఏమి చెయ్యాలి.. ఏమి చేయకూడదో తెలుసా..
మకర సంక్రాంతి రోజున చేసే స్నానానికి, దానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని విశ్వాసం. ఈ ప్రత్యేకమైన రోజున సూర్య భగవానుని పూజిస్తే అన్ని రకాల కష్టాలు తీరుతాయి. సూర్య భగవానుని ఆరాధించడం వల్ల గౌరవం, సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం.
సూర్యభగవానుడు ఒక రాశిని విడిచిపెట్టి మరొక రాశిలోకి ప్రవేశించే క్రియను సంక్రాంతి అని అంటారు. వీటన్నింటిలో మకర సంక్రాంతి అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మకర సంక్రాంతి 15వ తేదీన వచ్చింది. ఈ మకర సంక్రాంతి రోజున చేసే స్నానానికి, దానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని విశ్వాసం. ఈ ప్రత్యేకమైన రోజున సూర్య భగవానుని పూజిస్తే అన్ని రకాల కష్టాలు తీరుతాయి. సూర్య భగవానుని ఆరాధించడం వల్ల గౌరవం, సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం. మకర సంక్రాంతి సందర్భంలో.. ప్రతి వ్యక్తి పాటించవలసిన ముఖ్యమైన కొన్ని ప్రత్యేక నియమాలు గ్రంధాలలో చెప్పబడ్డాయి. మకర సంక్రాంతి రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
మకర సంక్రాంతి నాడు చేయాల్సిన పనులు:
- మకర సంక్రాంతి రోజున సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్య భగవానుని ఆరాధించడం వలన విశిష్ట ప్రయోజనాలు లభిస్తాయని గ్రంధాలలో చెప్పబడింది. అందుకే సూర్యోదయ సమయంలో అర్ఘ్యం సమర్పించండి.
- ఈ ప్రత్యేకమైన రోజున చేసే దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే మకర సంక్రాంతి రోజు నిరుపేదలకు కిచడీ, నువ్వులు, బెల్లం దానం చేయండి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు సంతోషిస్తాడు.
- తర్పణం మొదలైన వాటికి కూడా ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే మకర సంక్రాంతి రోజున పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తర్పణం ఇవ్వండి. మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల పితృ దోషం కూడా పోతుంది.
- వీలైతే, పవిత్ర నదిలో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల సర్వ పాపాల నుండి విముక్తి పొంది మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. నదిలో స్నానం చేసే అవకాశం లేకపోతే, ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నీటిలో కొన్ని చుక్కల గంగాజలాన్ని కలుపుకోండి.
మకర సంక్రాంతి నాడు చేయకూడని పనులు:
- మకర సంక్రాంతి రోజున ఒక వ్యక్తి కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలలో చెప్పబడింది. వాటిలో ముఖ్యమైనది ఈ రోజున తామసిక ఆహారం తీసుకోవడం నిషిద్ధం.. అలాగే మాంసాహారం, ఆల్కహాల్ వంటివి తీసుకోవద్దు.
- రాత్రి నుంచి నిల్వ ఉన్న ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున తీసుకోకండి. ఇలా నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం వలన ప్రతికూల శక్తి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయిస్తుంది.. ఆ వ్యక్తి కోపంతో ఉంటాడు.
- ఈ రోజున పేద లేదా నిస్సహాయ వ్యక్తిని గౌరవించండి. తగిన విధంగా సాయం అందించండి.
- ఈ రోజున అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఎవరైనా ఆకలి అంటూ ఇంటి వద్దకు భిక్ష కోసం వస్తే.. అతన్ని ఖాళీ చేతులతో తిరిగి పంపించకండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)