AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనిచేస్తే ఇలాంటి కంపెనీలో చేయాలి.. ఉద్యోగులకు అదిరిపోయే న్యూఇయర్ రివార్డు.. బోనస్‌గా నాలుగేళ్ల జీతం.

షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ స్థాయిలో బోనస్ లు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 నెలల జీతాన్ని అంటే.. సుమారు నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ఇస్తోందని ఈ విషయాన్ని ఆ సంస్థతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. 

పనిచేస్తే ఇలాంటి కంపెనీలో చేయాలి.. ఉద్యోగులకు అదిరిపోయే న్యూఇయర్ రివార్డు.. బోనస్‌గా నాలుగేళ్ల జీతం.
Evergreen Marine Corpany
Surya Kala
|

Updated on: Jan 09, 2023 | 8:43 PM

Share

ఉద్యోగులు తమ విధులను సంతోషముగా నిర్వహిస్తే.. ఆ సంస్థకు లాభాలు వస్తాయని కొన్ని కంపెనీలు ఆలోచిస్తాయి. అందుకనే తమ ఉద్యోగాలకు రకరకాల ఆఫర్స్ ఇస్తూ.. పనిలో ఉత్సాహంగా పనిచేలా చర్యలు తీసుకుంటాయి. తాజాగా  తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పోరేషన్‌ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు భారీ స్థాయిలో బోనస్ లు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 నెలల జీతాన్ని అంటే.. సుమారు నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ఇస్తోందని ఈ విషయాన్ని ఆ సంస్థతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు.

ఈ భారీ బోనస్  షిప్పింగ్ సంస్థకు చెందిన ఉద్యోగి జాబ్ గ్రేడ్ , ఫంక్షన్‌ని బట్టి మారుతుంది. అంతేకాదు తైవాన్ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఈ భారీ బోనస్‌ అందించనున్నదని..  వివరాలు ప్రైవేట్‌గా ఆ సంస్థ ఉంచుతుందని ఆ వ్యక్తి చెప్పారు.

వాస్తవానికి ఈ సంవత్సరాంతపు బోనస్‌లు ఎల్లప్పుడూ కంపెనీ పనితీరు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరుపై ఆధారపడి ఉంటాయని  ఎవర్‌గ్రీన్ మెరైన్ శుక్రవారం ఒక ప్రకటనలో వివరించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ షిప్పింగ్ బూమ్ ఫలితంగా ఎవర్‌గ్రీన్ మెరైన్ గత రెండు సంవత్సరాలుగా భారీ లాభాలను పొందింది. వినియోగ వస్తువులు,  సరుకు రవాణా రేట్ల డిమాండ్‌.. కరోనా మహమ్మారి, ఇంధన పెరుగుదల కూడా ఈ సంస్థ భారీ లాభాలను పొందడానికి కారణం. 2022లో కంపెనీ ఆదాయం రికార్డు స్థాయిలో $20.7 బిలియన్లకు చేరుకుందని అంచనా వేయబడింది. ఇది 2020 అమ్మకాల కంటే మూడు రెట్లు ఎక్కువ. అయితే ఈ బోనస్ ను అందుకునే అదృష్టం ఆ కంపనీలో పనిచేసే ఉద్యోగులందరికీ దక్కడం లేదని.. కొంతమంది మాత్రమే లక్కీ పర్సన్స్ అని తెలుస్తోంది.

అయితే ఈ కంపీనీ ని పెద్దగా పాఠకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.. ఎందుకంటే గత ఏడాది ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో అనుకోని విధంగా ఇరుక్కుని కొన్ని రోజుల పాటు సూయజ్ కాలువలో ఇతర రాకపోకలకు అంతరాయం కల్పించిన నౌక ఈ సంస్థకు చెందిందే

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..