AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: మీ భాగస్వామిని సర్‏ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మీపై మరింత ప్రేమ పెరుగుతుంది.. అదెలాగో తెలుసా..

ఏదైనా రిలేషన్‌షిప్ ప్రత్యేకంగా ఉండాలంటే.. సర్ప్రైజ్ ఇవ్వడం అవసరం. మీరు మీ భాగస్వామికి సర్ప్రైజ్ ఇస్తే.. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది.

Relationship Tips: మీ భాగస్వామిని సర్‏ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మీపై మరింత ప్రేమ పెరుగుతుంది.. అదెలాగో తెలుసా..
Romantic Surprise
Sanjay Kasula
|

Updated on: Jan 09, 2023 | 9:33 PM

Share

భార్య భర్తల బంధం అంటే గొడవ పడడం.. తిట్టుకోవడం.. విడిపోవడం కాదు. భార్య భర్తల బంధం చిరస్థాయిగా.. నిండు నూరేళ్లు ఒకటిగా ఉండటం. ఒకరికొకరు శాశ్వతంగా అలా నిలిచిపోవడం. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా భావిస్తుంది. ఏదైనా రిలేషన్‌షిప్ ప్రత్యేకంగా ఉండాలంటే.. అప్పుడప్పుడూ సర్ప్రైజ్ చేయడం అవసరం. మీరు మీ భాగస్వామితో మీ బంధాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే.. ఆశ్చర్యాన్ని ఇవ్వడం సులభమైన, ప్రభావవంతమైన మార్గాన్ని ఎంచుకోండి.

మీరు కూడా మీ భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటే.. ముందుగా మీరు కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించవచ్చు. ఇలా చేయడం ద్వారా మీరు మీ భాగస్వామిని ఎలా ఆశ్చర్యపరుస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ విధంగా మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి..

డిజిటల్ ప్రపంచంలో మనం ఉన్నప్పటికీ.. మీరు ఒక కాగితంపై ఏదైనా చక్కగా లెటర్.. అంటే చిన్న ప్రేమ లేఖ రాసి వారితో మీ అనుభూతిని పంచుకుంటే.. అది నిజంగా మీ భాగస్వామిని ఆశ్చర్యపరుస్తుంది. వారి ముఖంలో చిరునవ్వును తెచ్చిపెడుతాయి.

అభిరుచి జాబితా-

మీ భాగస్వామికి స్విమ్మింగ్ అంటే ఇష్టమైతే.. మీ భాగస్వామికి సభ్యత్వం తీసుకోండి. అలా చేయడం ద్వారా అతన్ని ఆశ్చర్యపరచండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మంచి అనుభూతి చెందుతారు.

కాంప్లిమెంట్ ఇవ్వండి-

మీరు ఏం చేయకుండా మీ భాగస్వామికి రొమాంటిక్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే.. మీరు మీ భాగస్వామిని మెచ్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీరు మీ భాగస్వామికి మంచి అనుభూతిని కలిగించవచ్చు.

స్పా డేని ప్లాన్ చేసుకోండి-

మీ భాగస్వామికి ప్రత్యేకమైన అనుభూతిని, ఆశ్చర్యాన్ని కలిగించడానికి మీరు స్పా డేని ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి రిలాక్స్ అవుతారు. మీ పట్ల ప్రేమ కూడా పెరుగుతుంది.

రొమాంటిక్ ట్రిప్-

మీరు మీ భాగస్వామిని ఆశ్చర్యపరచాలనుకుంటే.. మీరు మీ భాగస్వామిని మరోసారి రొమంటిక్ ట్రిప్‌కు తీసుకెళ్లవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ భాగస్వామి మంచి అనుభూతి చెందుతారు. మీరు కూడా ఒకరితో ఒకరు సమయం గడపగలుగుతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్..