China Coronavirus: చైనాలో కరోనా విజృంభణ.. భారతీయ మెడిసిన్స్‌కు డిమాండ్.. జోరుగా నకిలీ మందుల బ్లాక్ మార్కెట్ దందా..

Surya Kala

Surya Kala |

Updated on: Jan 10, 2023 | 8:42 AM

ఫైజర్స్ పాక్స్‌లోవిడ్, ఇండియన్ జెనరిక్ వెర్షన్‌లకు ఆ దేశంలో ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. కరోనా బాధితుల అవసరాలను అవకాశంగా తీసుకుని బ్లాక్ మార్కెట్ కు కొంతమంది తెరతీశారు. భారత వ్యాక్సిన్ అంటూ నకిలీ వ్యాక్సిన్లను అమ్ముతున్నారు.

China Coronavirus: చైనాలో కరోనా విజృంభణ.. భారతీయ మెడిసిన్స్‌కు డిమాండ్.. జోరుగా నకిలీ మందుల బ్లాక్ మార్కెట్ దందా..
China Corona

కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రకరకాల రూపాలను సంతరించుకుని మనవాళిపై తన ప్రభావం చూపిస్తూనే ఉంది. ప్రపంచాన్ని గత మూడేళ్ళుగా వణికిస్తూనే ఉంది. తాజాగా ఒమిక్రాన్ సరికొత్త రూపాన్నిBF.7 గా సంతరించుకుంది. మళ్ళీ కరోనా పుట్టినిళ్లు చైనా సహా అనేక దేశాలను గజగజవణికిస్తోంది. డ్రాగన్ కంట్రీలో మరోసారి విజృంభిస్తుంది కరోనా. ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్‌ అయిన హెనాన్‌లో దాదాపు 90 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని ఆరోగ్య శాఖ అధికారులు అధికారికంగా తెలిపారు. ప్రావిన్స్‌లోని మొత్తం జనాభాలో 89 శాతం మందికి వైరస్‌ సోకిందని సెంట్రల్‌ హెనాన్‌ ప్రావిన్స్‌ హెల్త్‌ కమిషన్‌ డైరెక్టర్‌ అన్నారు. జనవరి 6నాటికి ప్రావిన్స్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్‌ రేటు 89.0 శాతానికి చేరిందన్నారు. ప్రావిన్స్‌లో మొత్తం 9 కోట్ల 94 లక్షల మంది జనాభాలో సుమారు 8 కోట్ల 85 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారని వెల్లడించారు. జ్వరం లక్షణాలతో క్లినిక్‌లకు వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు.

ఇంత భారీగా కేసులు పెరగడానికి గల కారణం.. డిసెంబర్‌లో జీరో-కోవిడ్ విధానాలకు గుడ్ బై చెప్పడమే నని పేర్కొన్నారు. అప్పటి నుంచి చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుల  సూచిస్తోందని తెలిపారు.  లాక్ డౌన్ కు వ్యతిరేకంగా చైనీయులు నిరనసలు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు చైనాలో కోవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరగడం వల్ల భారతీయ జనరిక్ ఔషధాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. యాంటీవైరల్‌లకు, ముఖ్యంగా ఫైజర్స్ పాక్స్‌లోవిడ్, ఇండియన్ జెనరిక్ వెర్షన్‌లకు ఆ దేశంలో ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. కరోనా బాధితుల అవసరాలను అవకాశంగా తీసుకుని బ్లాక్ మార్కెట్ కు కొంతమంది తెరతీశారు. భారత వ్యాక్సిన్ అంటూ నకిలీ వ్యాక్సిన్లను అమ్ముతున్నారు. అక్కడ భారతీయ జనరిక్ మెడిసిన్స్ ను తయారు చేసే నకిలీ సంస్థలు చైనాలో బ్లాక్ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయని చైనా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాక్స్‌లోవిడ్ కొరత, ప్రభుత్వ క్లినిక్‌లలో అధిక నియంత్రణ ఉండడంతో భారతీయ జనరిక్ వెర్షన్‌ల అమ్మకాలు చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu