AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thaman: వీరసింహా రెడ్డి‌ థియేటర్స్‌లో కూడా స్పీకర్లు పగులుతాయి..నేనేం చేయలేను: తమన్

బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నఈ  మోస్ట్ అవైటెడ్ మూవీ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది.

Thaman: వీరసింహా రెడ్డి‌ థియేటర్స్‌లో కూడా స్పీకర్లు పగులుతాయి..నేనేం చేయలేను: తమన్
Thaman
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2023 | 9:09 AM

Share

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ నయా మూవీ వీరసింహారెడ్డి కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నఈ  మోస్ట్ అవైటెడ్ మూవీ జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టాప్ ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం అందిస్తున్నఈ  సినిమాలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  తాజాగా ఈ మూవీ గురించి తమన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తమన్ మాట్లాడుతూ.. వీరసింహారెడ్డి కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. వీరసింహారెడ్డి వేరే రేంజ్ లో వుంటుంది. బాలకృష్ణ గారి కల్ట్ మూవీ ఇది. బాలకృష్ణ గారిని ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ఎంత అభిమానిస్తున్నారో వీరసింహారెడ్డి రిజల్ట్ చెబుతుంది అన్నారు. అలాగే వీరసింహ రెడ్డికి అఖండతో పోలిక లేదు. ఇది కల్ట్ మూవీ. ఎమోషనల్ హై, సిస్టర్ సెంటిమెంట్, బాలకృష్ణ గారి మాస్ అదిరిపోతుంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ గారి అభిమానిగా చాలా గొప్పగా తీశారు. నేపధ్య సంగీతం కూడా చాలా బాగా వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇద్దరూ చాలా అద్భుతంగా వున్నారు. దర్శకుడు పాత్రలు చాలా బాగా డిజైన్ చేశాడు. దర్శకుడు మంచి సినిమా తీస్తేనే నేను మంచి మ్యూజిక్ ఇవ్వగలను. ఒక సినిమాకి భేస్ మెంట్ దర్శకుడే. గోపి అద్భుతంగా తీయడం వలనే మంచి మ్యూజిక్ ఇచ్చే అవకాశం వచ్చింది. పోటి అనేది ప్రతి చోట వుంటుంది. పోటి ఉన్నప్పుడే మంచి కంటెంట్ వస్తుంది. ఆరోగ్యకరమైన పోటి మంచి విషయమే కదండీ. అన్ని సినిమాలు గొప్పగా ఆడాలి. అందరూ బావుండాలి. తెలుగు సినిమా ఇప్పుడు మంచి స్థితిలో వుంది. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి రెండూ గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి

వీరసింహా రెడ్డి లో కూడా స్పీకర్లు పగులుతాయి. జాగ్రత్త అని ముందే చెప్పాను. బాలకృష్ణ గారిని చూస్తేనే ఎక్కువ వాయించేయాలని అనిపిస్తుంది. నన్ను ఏం చేయమంటారు.. బాలయ్య గారి కటౌట్ ఎక్కువ మ్యూజిక్ అడుగుతుంది. నేనేం చేయలేను అన్నారు. జై బాలయ్య సాంగ్ విషయానికొస్తే సీన్ లో బాలయ్య గారిని చూడటానికి లక్షమంది జనం వస్తారు. అక్కడ నాకు పాట కావాలని దర్శకుడు సందర్భం చెప్పారు. ఆ పాటకు కరెక్ట్ బీజీయం తో మొదలుపెట్టడానికి దాదాపు ఒక డెబ్బై మంది సింగర్స్ ఈ పాట కోరస్ గా పాడించాం..సెకండ్ హాఫ్ లో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లతో అదరగొట్టే సినిమా ఇది. పాప్ కార్న్ తినే సమయం కూడా వుండదు. సినిమాని చూస్తూనే వుంటారు అని అన్నారు తమన్.

Follow Us