AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సేవా తీర్థంలో తొలి కేబినెట్ మీటింగ్.. ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్

ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఇటీవల సేవా తీర్థకు మార్చిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం అక్కడ కొత్త పీఎం కార్యాలయం ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడ తొలి కేబినెట్ సమావేశం మంగళవారం నిర్వహించారు. దీనిపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

PM Modi: సేవా తీర్థంలో తొలి కేబినెట్ మీటింగ్.. ప్రధాని మోదీ ఎమోషనల్ ట్వీట్
Pm Modi
Venkatrao Lella
|

Updated on: Feb 24, 2026 | 7:08 PM

Share

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల కొత్తగా సేవా తీర్థంకు మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇక్కడ తొలిసారి మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు కావడం, సేవా తీర్థంలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో సేవా సంకల్ప తీర్మానం ఆమోదించారు. ఇక కేరళ పేరును కేరళంగా మార్చుతూ చారిత్రాత్మక నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక శ్రీనగర్‌లోని ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ప్రాజెక్టును కేబినెట్ ఆమోదించింది.

తొలి సమావేశంపై మోదీ ట్వీట్

సేవా తీర్థంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశం గురించి ప్రధాని మోదీ ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఆజ్ యుగాబ్ద 5127, విక్రమ సంవత్సరం 2082, ఫాల్గుణ శుక్ల అష్టమి రోజు శుభ ముహూర్తాన సేవా తీర్థంలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించడం ఆనందంగా ఉంది. దేశం కోసం అవసరమైన అనేక అపూర్వమైన నిర్ణయాలు ఇందులో తీసుకోవడం జరిగింది. 140 కోట్ల మంది దేశ ప్రజల సామర్థ్యం ఆధారంగా నిర్మించిన సేవా తీర్థం జాతీయ సేవ అనే విధి ఆధారిత యుగాన్ని నిరంతరం నడిపిస్తుందని ఆశిస్తున్నా. జాతీయ యుగంలో మన మత్రం యద్ భద్రం తన్న ఆ సువా. దీని అర్దం నిరంతరం శుభకరమైన, ప్రయోజనకరమైన ప్రతిదాన్ని కొత్త దానిని స్వీకరిస్తాం” అంటూ మోదీ పేర్కొన్నారు.

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు

-కేరళ పేరును కేరళంగా మార్పు -గోండియాను జబల్పూర్ రైల్వే స్టేషన్‌కు రెట్టింపు చేయడం -జార్ఖండ్‌లోని ఘమారియా నుంచి చండిల్ వరకు మూడు, నాలుగు లైన్లు -ఆహ్మదాబాద్ మెట్రో విస్తరణ -ముడి జనపనార కోసం ఎంఎస్‌పీ రూ.5,925కు పెంపు -శ్రీనగర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ -విద్యుత్ రంగంలో ప్రధాన సంస్కరణలకు ఆమోదం

Follow Us