AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

Gold Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దిగి వస్తున్నాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 3.5% తగ్గి ఔన్సుకు $4,488కి చేరింది. 1983 తర్వాత వారంలో ఇంత భారీ తగ్గుదల నమోదు కావడం..

Gold Price Today: ఎన్నడు లేని విధంగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
Gold Price
Subhash Goud
|

Updated on: Mar 23, 2026 | 6:19 AM

Share

Gold Price Today: ప్రస్తుతం మహిళలకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఎన్నడు లేని విధంగా ఊహించని స్థాయిలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన ఈ రెండు లోహాలు ఇప్పుడు అదే రికార్డు స్థాయిలో పతనం అవుతున్నాయి.

గత వారం భారత బులియన్ మార్కెట్‌కు అత్యంత విపత్కరమైనదిగా నిలిచింది. బంగారం, వెండి ధరలు దశాబ్దాలలోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. బలపడుతున్న ప్రపంచ డాలర్, అధిక వడ్డీ రేట్ల భయాలు బంగారం ధరలను కిలోకు రూ.1.45 లక్షలకు, వెండి ధరలను కిలోకు రూ. 2.45 లక్షలకు నెట్టాయి.

ఇది కూడా చదవండి: సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ. 4 లక్షల పరిహారం.. కమిషన్ సంచలన నిర్ణయం

ఇవి కూడా చదవండి

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.
  2. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,110 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,940 వద్ద కొనసాగుతోంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.
  4. విజయవడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,190 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,960 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,790 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: LPG Gas Price: గ్యాస్ సిలిండర్ల ధరలు మరింత పెరుగుతాయా? కారణం తెలిస్తే షాకవుతారు!

ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా భారీగానే దిగి వస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్‌, కేరళ, చెన్నై నగరాల్లో రూ.2,49,900 వద్ద కొనసాగుతుండగా, ఇక ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్‌లో రూ.2,44,900 వద్ద ట్రేడవుతోంది.

ఇదిలా ఉండగా, గత శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 3.5% తగ్గి ఔన్సుకు $4,488కి చేరింది. 1983 తర్వాత వారంలో ఇంత భారీ తగ్గుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. వెండి ధర కూడా 7.1% గణనీయంగా తగ్గింది. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 10 గ్రాములకు సుమారు రూ. 145,960 వద్ద ట్రేడ్ అవుతోంది

అధిక బాండ్ దిగుబడులు, బలపడిన అమెరికన్ డాలర్ కారణంగా కామెక్స్ బంగారం ఒత్తిడికి గురవుతోంది. ఇది బంగారం మెరుపును తగ్గించింది. అలాగే ప్రస్తుతం అది ఒక దిద్దుబాటు దశలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, దేశీయ కారకాల వల్ల ముఖ్యంగా రూపాయి బలహీనత కారణంగా ఎంసీఎక్స్ బంగారం కొంత బలాన్ని ప్రదర్శించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us