Minister: మహిళా అథ్లెట్ కోచ్ పై క్రీడా శాఖ మంత్రి లైంగిక వేధింపులు..! మంత్రిపదవికి రాజీనామా..
అథ్లెటిక్స్ మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించిన కేసులో హర్యానా క్రీడా శాఖ మంత్రి , భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్‌సింగ్ అడ్డంగా బుక్కయ్యారు. తన నివాసంలో మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించినట్టు
అథ్లెటిక్స్ మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించిన కేసులో హర్యానా క్రీడా శాఖ మంత్రి , భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్‌సింగ్ అడ్డంగా బుక్కయ్యారు. తన నివాసంలో మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో సందీప్‌సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే తనపై కుట్ర చేశారని , ఎవరిని వేధించలేదని అంటున్నారు సందీప్ సింగ్. హర్యానాకు చెందిన మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఫిర్యాదును స్వీకరించిన చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఇక, సందీప్ సింగ్ ఒలింపియన్.. అలాగే భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్. 2019లో కురుక్షేత్రలోని పెహోవా నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం హర్యానా క్రీడా శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సందీప్ సింగ్‌పై మహిళా జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. తాను చెప్పినట్టు నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వేధించినట్టు తెలిపారు. చండీగఢ్‌లోని సందీప్ సింగ్ అధికారిక నివాసానికి వెళ్లిన సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా కోచ్ ఆరోపించారు. అయితే మహిళా కోచ్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని అంటున్నాడు సందీప్‌సింగ్ . నైతిక విలువలతో పదవికి రాజీనామా చేస్తునట్టు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు వెలుగు లోకి వస్తాయన్నాడు. ఇక, బాధిత మహిళ.. సెప్టెంబర్‌లో జూనియర్ కోచ్‌గా రిక్రూట్ అయ్యారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న మహిళను ప్రభుత్వ అత్యుత్తమ స్పోర్ట్స్ పర్సన్ పథకం కింద నియమించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos