ప్రతీ రోజూ బొప్పాయి పండును తినటం వల్ల మన శరీరానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, రాత్రిళ్లు బొప్పాయి తింటే మంచిదా? కాదా? శరీరంలో జరిగేది తెలిస్తే..
రాత్రిళ్లు బొప్పాయి పండు తింటే ప్రయోజనాలు..బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ప్రొటీన్స్‌ను బ్రేక్ చేయటంలో ఉపయోగపడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బొప్పాయి పండులోని హై ఫైబర్ మలబద్ధకం లాంటి సమస్యల్ని నివారిస్తుంది. రాత్రి వేళ ఆరోగ్యకరమైన బోవెల్ మూమెంట్స్ ఉండేలా చూస్తుంది.
ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. తక్కువ కాలరీలు ఆకలిని తగ్గించి బరువు అదుపులో ఉంచడానికి సాయపడతాయి.
బొప్పాయిలో ఉండే లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ముడతలను, సూర్యరశ్మి వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
బొప్పాయిలో ఫైబర్, నీటిశాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్ధకాన్ని నివారిస్తాయి, శరీరంలో వాపులను తగ్గిస్తాయి. గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి.
బొప్పాయిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్, కెరోటినాయిడ్ల వంటి యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.
బొప్పాయిలో బీటా కెరోటిన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను రక్షిస్తాయి. రెటీనాను కాపాడటంతో పాటు, వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను నివారిస్తాయి.