AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: 3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్.. ఎవరొచ్చారంటే?

Team India Changes: భారత జట్టు జింబాబ్వే జట్టుతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో ముఖ్యంగా మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే, ఈ మ్యాచ్ గెలిస్తే భారత జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. దీంతో కీలక మార్పులకు గౌతమ్ గంభీర్, సూర్య భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

IND vs ZIM: 3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్.. ఎవరొచ్చారంటే?
Team India
Venkata Chari
|

Updated on: Feb 25, 2026 | 3:40 PM

Share

Team India Changes: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే జింబాబ్వేపై భారీ విజయం టీం ఇండియాకు అనివార్యం. ఈ కీలక మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు చోటు చేసుకోనున్నాయి. తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్, రింకు సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. రింకు వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లడంతో సందిగ్ధత నెలకొంది.

టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీం ఇండియా ప్రస్థానం ఉత్కంఠగా మారింది. ప్రతి మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారడంతో జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే కేవలం గెలుపుతో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. ముఖ్యంగా దక్షిణాఫ్రికా చేతులో ఎదురైన 76 పరుగుల ఘోర పరాజయం భారత్ నెట్ రన్ రేట్‌ను మైనస్‌లోకి నెట్టేసింది. ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు గండం గట్టెక్కాలంటే జింబాబ్వేపై సాధారణ విజయం సరిపోదు. ఒక భారీ విధ్వంసం సృష్టించి, జింబాబ్వేను చిత్తుగా ఓడించి రన్ రేట్‌ను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వెస్ట్ ఇండీస్‌తో జరిగే చివరి పోరులో కూడా భారత్‌కు అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: IND vs SA: సూర్య, గంభీర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే.. టీమిండియా ఓటమికి కారణం: అశ్విన్

ఈ కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్ గురువారం, 26వ తేదీన చెన్నైలోని వేదికగా జింబాబ్వేతో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీం ఇండియా తుది జట్టులో మూడు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పులు జట్టు బలాన్ని పెంచి, విజయావకాశాలను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.

మొదటి మార్పుగా, ఫామ్ లేమితో గత కొంతకాలంగా సతమతమవుతున్న తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంజు శాంసన్ బ్యాటింగ్‌లో స్థిరత్వాన్ని, దూకుడును తీసుకురాగలడని భావిస్తున్నారు. రెండవ మార్పుగా, వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులో చేరవచ్చు. అక్షర్ పటేల్ తన స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు చేయగలడు.

ఇది కూడా చదవండి: IND vs ZIM: గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్..?

మూడవ, అత్యంత కీలకమైన మార్పు రింకు సింగ్‌కు సంబంధించింది. రింకు సింగ్ కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా హుటాహుటిన జట్టును వీడి ఇంటికి వెళ్ళిపోయినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితులు విషమంగా ఉండటంతో అతడు వెంటనే వెళ్ళాల్సి వచ్చిందని సమాచారం. దీంతో గురువారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌కు రింకు సింగ్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఫినిషర్‌గా మెరుపులు మెరిపించాల్సిన రింకు ఈ ప్రపంచ కప్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వ్యక్తిగత కారణాలు, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అతడిని జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆడించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు, మ్యాచ్ జరిగే చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో రింకు స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?

మొత్తంగా, తిలక్ వర్మ స్థానంలో సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్, రింకు సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవులతో కూడిన ఈ మూడు మార్పులు జింబాబ్వేతో జరిగే ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో టీం ఇండియాకు కీలకం కానున్నాయి. ఈ మార్పులతో భారత జట్టు సెమీ ఫైనల్ రేసులో నిలబడటానికి పటిష్టంగా సిద్ధమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
3 మార్పులతో బరిలోకి భారత జట్టు.. గంభీర్, సూర్య స్కెచ్ అదుర్స్
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..
అదిరిపోయే డ్రెస్‌లో ఆలియా.. అందమే అసూయ పడుతుందేమో..
డబ్బుకు డబ్బు, పరపతికి పరపతి.. మాలవ్య రాజయోగంతో వీరికి అదృష్టం!
డబ్బుకు డబ్బు, పరపతికి పరపతి.. మాలవ్య రాజయోగంతో వీరికి అదృష్టం!
ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే పెరుగు వారం రోజులైనా తాజాగా ఉంటుంది..!
ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే పెరుగు వారం రోజులైనా తాజాగా ఉంటుంది..!
భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
భారీగా పెరగనున్న ఏసీ ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
యూట్యూబర్ నా అన్వేష్‌కు మరో బిగ్ షాక్.. ఈ సారి అరెస్టే..!
యూట్యూబర్ నా అన్వేష్‌కు మరో బిగ్ షాక్.. ఈ సారి అరెస్టే..!
కాకర కూర కంటే ఉడకబెట్టి తింటే మగవారిలో ఆ సమస్యలు పారిపోతాయ్
కాకర కూర కంటే ఉడకబెట్టి తింటే మగవారిలో ఆ సమస్యలు పారిపోతాయ్
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
భార్యల మాట వినే ఉత్తమ భర్తల రాశులు ఇవే..! మీ రాశి వీటిలో ఒకటా?
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..
ప్రజలకు ఇది కదా కావాల్సింది.. కొత్తగా 2.88 లక్షల ఇళ్లు మంజూరు..