AC Prices Hike: సమ్మర్ వేళ ప్రజలకు షాక్.. మరింత ఖరీదు కానున్న ఏసీలు.. ఒకేసారి ఎంత పెరుగుతాయంటే..?
సమ్మర్ వచ్చేస్తుంది. ఇప్పటినుంచే ఎండ ప్రభావం మొదలైంది. పగటిపూట ఉష్ణోగ్రతల్లో కాస్త పెరుగుదల నమోదవుతోంది. ఏప్రిల్ నుంచి ఎండలు దంచికొట్టనున్నాయి. ఈ క్రమంలో ఏసీల వినియోగం పెరగనుండగా.. వీటి ధరలు కూడా భారీగా పెరగనన్నాయి. ఇందుకు కారణాలు ఏంటి అనే విషయాలు ఇందులో చూద్దాం.

ఎండాకాలం మొదలైపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఎండ ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కబోత కూడా మొదలవుతోంది. సమ్మర్ వచ్చేస్తుండటంతో ఏసీల వినియోగం ఇళ్లల్లో పెరగనుంది. ఇక ఉక్కబోత, ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ఏసీలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించనున్నారు. దీంతో సమ్మర్‌లో ఏసీల విక్రయాలు భారీగా పెరుగుతూనే ఉంటాయి. ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఏసీల సేల్స్ ఒక్కసారిగా పెరుగుతూ ఉంటాయి. ఎండాకాలం మొదలవ్వడంతో ఇప్పటినుంచే ఇంట్లోకి ఏసీని కొనుగోలు చేసేందుకు చాలామంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇలాంటివారికి షాక్ తగలనుంది. ఏసీల ధరలు భారీగా పెరగనన్నాయని తెలుస్తోంది.
ఎంత పెరుగుతాయంటే..?
ఏసీల ధరలు 15 శాతం పెరిగే అవకాశాలున్నాయి. దీనికి కారణం ఏసీల తయారీకి ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడమే. ఏసీల తయారీకి వినియోగించే రాగి, అల్యూమినియం ఖర్చులు భారీగా పెరిగాయి.అంతేకాకుండా ఇతర మెటిరియల్ ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో ఏసీల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. దాదాపు 5 శాతం నుంచి 15 శాతం వరకు ధరలు పెరగనున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మెటిరియల్ ఖర్చులు, సామర్థ్య ప్రమాణాలు పెరుగుతుండటంతో ధరలను పెంచాల్సి వస్తోందని తయారీ కంపెనీలు చెబుతున్నాయి. త్వరలోనే ఏసీ ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఈ ఎండాకాలం సీజన్‌లోనే పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఏసీ కొనాలంటే మరింత ఖరీదు కానుంది.
పెరగనున్న డిమాండ్
ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు విపరీతంగా ఉంటాయి. దీని వల్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఏసీలు, ఫ్యాన్లు, డెజర్ట్ కూలర్లు వంటి వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో వల్ల వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ డిమాండ్ కారణంగా వాటి ధరలు పెరగనున్నాయి. కాగా వేసవి కాలం వస్తుండటంతో కంపెనీలు అప్‌గ్రేడ్ వెర్షన్ ఏసీలు, కూలర్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్ ఏసీ ఎనేబుల్డ్ వెర్టిస్ స్పిట్ ఏసీ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. అంటే రిమోట్‌లో టెంపరేచర్‌ను మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న వాస్తవ గది టెంపరేచర్ ఆధారంగా అదే ఆటోమేటిక్‌గా సెట్ చేస్తూ ఉంటుంది. దీని వల్ల ప్రతీసారి వినియోగదారులు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం లాంటివి చేయాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల కరెంట్ కూడా ఆదా అవుతుంది. అలాగే మిగతా కంపెనీలు కూడా ఏఐ ఆధారిత సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఏసీలను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
