AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Human Sacrifice: మూఢనమ్మకాల ముసుగులో అమానుషం.. కోటీశ్వరులవ్వాలనే ఆశతో 9 ఏళ్ల బాలుడు నరబలి!

ధనవంతులు కావాలనే ఆశతో తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, ఆపై నరబలి ఇచ్చారు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఈ దారుణ ఘటనలో మైనర్‌తోసహా ముగ్గురిని పోలీసులు బుధవారం (జనవరి 11) అరెస్ట్‌ చేశారు..

Human Sacrifice: మూఢనమ్మకాల ముసుగులో అమానుషం.. కోటీశ్వరులవ్వాలనే ఆశతో 9 ఏళ్ల బాలుడు నరబలి!
Human Sacrifice Killing
Srilakshmi C
|

Updated on: Jan 12, 2023 | 8:42 AM

Share

కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలో దారుణం చోటు చేసుకుంది. ధనవంతులు కావాలనే ఆశతో తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, ఆపై నరబలి ఇచ్చారు. ఆపై మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఈ దారుణ ఘటనలో మైనర్‌తోసహా ముగ్గురిని పోలీసులు బుధవారం (జనవరి 11) అరెస్ట్‌ చేశారు. అసలేంజరిగిందంటే..

కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీలోని సయాలీ గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు డిసెంబర్ 29న అదృశ్యమయ్యాడు. బాలుడి అదృశ్యంపై కుటుంబ సభ్యులు డిసెంబర్ 30న సిల్వాస్సా పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వంద మంది పోలీస్‌లతో వేరువేరు టీంలుగా గాలింపు చర్యలు చేపట్టారు. దాద్రా నగర్ హవేలీకి 30 కిలోమీటర్ల దూరంలో గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపిలోని కాలువ సమీపంలో ఉన్న వాపిలో తలలేని మృతదేహం లభ్యమైంది. ఇతర శరీర భాగాలు సయాలి గ్రామంలో లభ్యమయ్యాయి. మృతదేహం భాగాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

అనంతరం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఓ మైనర్‌ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. గత ఏడాది (2022) డిసెంబర్ 29న సయాలీ గ్రామం నుంచి బాలుడిని అపహరించి, నరబలి ఇచ్చినట్లు బాలుడు వెల్లడించాడు. మైనర్ బాలుడు వెల్లడించిన కథనం మేరకు ప్రధాన నిందితులు శైలేష్ కొహ్కెరా (28), రమేష్ సన్వర్ లపై హత్య కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు మీడియాకు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.