AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HP Gas Cylinder: గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అదనంగా రూ.30 చెల్లించాలని డిమాండ్‌.. ఫిర్యాదు చేయగా రూ.లక్ష చెల్లించుకున్నాడు!

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత వినియోగదారుడిని అదనంగా రూ.30 అడగటంతో కోర్టు శుక్రవారం (జనవరి 13) ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది. సేవాలోపమని దాఖలైన ఫిర్యాదులో వినియోగదారుడికి గ్యాస్‌ ఏజెన్సీ ఏకంగా..

HP Gas Cylinder: గ్యాస్‌ డెలివరీ బాయ్‌ అదనంగా రూ.30 చెల్లించాలని డిమాండ్‌.. ఫిర్యాదు చేయగా రూ.లక్ష చెల్లించుకున్నాడు!
HP Gas
Srilakshmi C
|

Updated on: Jan 15, 2023 | 6:47 AM

Share

గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ చేసిన తర్వాత వినియోగదారుడిని అదనంగా రూ.30 అడగటంతో కోర్టు శుక్రవారం (జనవరి 13) ఏకంగా రూ.లక్ష జరిమానా విధించింది. సేవాలోపమని దాఖలైన ఫిర్యాదులో వినియోగదారుడికి గ్యాస్‌ ఏజెన్సీ రూ.లక్ష పరిహారంగా చెల్లించాలని తీర్పు నిచ్చింది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురానికి చెందిన ఓ వినియోగదారుడు 2019 అక్టోబరు 7న రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్నారు. గుత్తిరోడ్డులోని హనుమాన్‌ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్‌ కనెక్షన్‌ నుంచి డెలివరీ బాయ్‌ గ్యాస్‌ సిలిండర్‌ తీసుకొచ్చాడు. అనంతరం అదనంగా రూ.30 ఇవ్వాలని డెలివరీ బాయ్‌ కోరాడు. ఇవ్వనని వినియోగదారుడు చెప్పడంతో డెలివరీ బాయ్‌ సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లాడు. దీంతో వినియోగదారుడు పౌర సరఫరాల అధికారిని సంప్రదించడంతో తిరిగి సిలిండర్‌ను ఇంటిముందు ఉంచి వెళ్లిపోయారు. ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లగా సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని అడుగుతుంటారని డెలివరీ బాయ్‌ చేసిన దాన్ని సమర్థించారు. అనంతరం ఫిర్యాదు చేసిన వినియోగదారుడిని మరో ఏజెన్సీకి బదిలీ చేశారు.

ఏజెన్సీని మార్చడంపై సదరు వినియోగదారుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. సిలిండర్‌ లేకపోవడంతో పడిన ఇబ్బందులను తెలియజేస్తూ జిల్లా వినియోగదారుల ఫోరానికి తన ఫిర్యాదులో రాత పూర్వకంగా పేర్కొన్నాడు. దీంతో ఫోరం గ్యాస్‌ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీచేసింది. దీనిపై విచారణ చేపట్టగా.. డెలివరీ బాయ్‌ను తొలగించినందున పరిహారం చెల్లించాల్సి అవసరం లేదని ఏజెన్సీ తెల్పింది. ఐతే ఏజెన్సీ తీరును తప్పుబట్టిన ఫోరం బెంచ్‌.. రూ.లక్ష పరిహారం ఏజెన్సీనే చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యురాలు ఎం.శ్రీలత శుక్రవారం తీర్పునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?