ఇకపై పాఠశాలల్లో ఉపాధ్యాయులను ‘మేడాం.. సార్‌..’అని పిలవకూడదు: విద్యాశాఖ

స్కూళ్లలో విద్యార్ధులు ఉపాధ్యాయులను 'మేడాం.. సార్‌..' అని ఇకపై పిలవకూడదట! మరేం పిలవాలని అనుకుంటున్నారా..? కేవలం ఇలా మాత్రమే పిలవాలంటూ సర్కార్ హుకూం..

ఇకపై పాఠశాలల్లో ఉపాధ్యాయులను 'మేడాం.. సార్‌..'అని పిలవకూడదు: విద్యాశాఖ
Gender Neutral Term In All Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 14, 2023 | 9:01 AM

స్కూళ్లలో విద్యార్ధులు ఉపాధ్యాయులను ‘మేడాం.. సార్‌..’ అని ఇకపై పిలవకూడదట! మరేం పిలవాలని అనుకుంటున్నారా..? కేవలం ‘టీచర్‌’ అనే పిలవాలట. మహిళా, పురుష ఉపాధ్యాయులు ఎవరినైనా లింగబేధం లేకుండా పాఠశాల ఉపాధ్యాయులందరినీ ‘టీచర్’ అని మాత్రమే సంబోధించాలని కేరళ బాలల హక్కుల ప్యానెల్ ఆదేశించింది. ‘టీచర్‌’ అనేది లింగ తటస్థ పదమని వాటిని సంబోధించడానికి కేరళ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (KSCPCR) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్‌’ అనే పదాన్ని ఉపయోగించాలని ప్యానెల్ చైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సీ విజయకుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (జనవరి 13) విద్యాశాఖను ఆదేశించింది.

పాఠశాల ఉపాధ్యాయులను వారి లింగం ఆధారంగా ‘సర్’, ‘మేడమ్’ అని సంబోధించడం లింగ వివక్షతను సూచిస్తోందని, లింగ వివక్ష లేకుండా గౌరవంగా సంబోధించడానికి అన్ని విద్యాసంస్థల్లో ‘టీచర్’ అనే పదాన్ని ఉపయోగించాలని ప్యానెల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.’సర్’/’మేడమ్’ అనే పదాలు గౌరవప్రదంగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులనే భావనతో అవి సరిపోలడం లేదని ప్యానెల్‌ అభిప్రాయ పడింది. టీచర్‌ అనే పదం ఉపాధ్యాయులకు విద్యార్ధులను దగ్గర చేస్తుందని ప్యానెల్ భావించింది. పాఠశాలల్లో దీనిని ప్రవేశపెట్టిన రెండు నెలలోపు నివేదిక సమర్పించాలని జనరల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.