Tamil Nadu: ఆయనొక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. పీఎం రేంజ్‌లో సెక్యూరిటీ.. కేంద్రం ఎందుకీ నిర్ణయం తీసుకుందంటే..
అతనో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, వయసు కూడా చిన్నదే, కానీ అతనికి ప్రధాని తర్వాత స్థాయి భద్రతను కల్పిస్తోంది కేంద్రం. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కమెండోస్‌తో భద్రతను..
అతనో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, వయసు కూడా చిన్నదే, కానీ అతనికి ప్రధాని తర్వాత స్థాయి భద్రతను కల్పిస్తోంది కేంద్రం. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కమెండోస్‌తో భద్రతను పెంచింది కేంద్రం. అది కూడా సాదాసీదాగా కాదు. ఏకంగా 33మంది కమెండోలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఇచ్చింది. ప్రధానమంత్రి తర్వాత స్థాయిలో కల్పించే భద్రతను అన్నామలైకి కల్పించడం తమిళనాట సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా, గవర్నర్ వర్సెస్ సీఎం ఫైట్ జరుతుండటం.. అదే టైమ్‌లో స్టాలిన్ ప్రభుత్వాన్ని అన్నామలై టార్గెట్ చేయడం.. రాజకీయంగా కాకరేగుతోంది. అన్నామలై సైతం సీఎం స్టాలిన్, అతని కుమారుడు మంత్రి ఉదయనిధిని టార్గెట్ చేస్తున్నారు.
డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తోన్న తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకి కొన్నాళ్లుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయ్. తీవ్రవాదులు, మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. దాంతో, వై కేటగిరి భద్రత కల్పించింది కేంద్రం. అయితే, అన్నామలైకి ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఐబీ రిపోర్ట్ ఆధారంగా అన్నామలైకి జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ ఆదేశాలిచ్చింది.
తమిళనాడుకు చెందిన అన్నామలై 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్నాటక కేడర్ కింద పనిచేసి 2019లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన అన్నామలైకి తమిళనాడు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది పార్టీ. డీఎంకే గవర్నమెంట్‌పై దూకుడుగా వెళ్తోన్న అన్నామలైకి బెదిరింపులు పెరిగిపోవడంతో 33మంది కమెండోలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించింది కేంద్రం. ఓ రాష్ట్రశాఖ పార్టీ అధ్యక్షుడికి జెడ్ కేటగిరి భద్రత కల్పించడం తమిళనాట సంచలనంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..