Delhi Anjali Death: ఢిల్లీ యువతి అంజలి డెత్ కేస్‌లో ట్విస్ట్.. సీన్‌లోకి కేంద్రం.. ఆ 11 మందిపై సస్పెన్షన్ వేటు..
ఢిల్లీ యువతి అంజలి డెత్ కేస్ ఊహించని మలుపు తిరిగింది. సడన్ ట్విస్ట్ ఇస్తూ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. 11మంది పోలీసులపై సస్పెన్షన్ వేటేసింది.
ఢిల్లీ యువతి అంజలి డెత్ కేస్ ఊహించని మలుపు తిరిగింది. సడన్ ట్విస్ట్ ఇస్తూ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. 11మంది పోలీసులపై సస్పెన్షన్ వేటేసింది. ఇంతకీ, అంజలి డెత్ కేస్‌లో కేంద్ర హోంశాఖ ఎందుకు జోక్యం చేసుకుంది?. పోలీసులపై వేటేయడానికి కారణమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీ యువతి అంజలి డెత్ కేస్ మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. అంజలి డెత్‌పై మొదట్నుంచీ అనుమానాలు ముసురుకున్నాయ్. అంజలి చనిపోయిన తీరు, ఆమె ఫ్రెండ్ నిధి పారిపోవడం, అంజలి డెడ్‌బాడీ నగ్నంగా ఉండటం, నిందితులంతా మద్యం మత్తులో ఉండటం, అంజలి ఇంట్లో చోరీ జరగడం.. ఇలా అనేక ఇన్సిడెంట్.. అంజలి డెత్‌పై అనుమానాలు కలిగేలా చేశాయ్.
జనవరి ఒకటిన ఢిల్లీ నడిబొడ్డున జరిగిన హిట్ అండ్ రన్ డెత్ కేసులోకి ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఎటరైంది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. మొత్తం 11మంది పోలీసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. డీసీపీతోపాటు మరో పది మంది పోలీసులపై వేటేసింది. వీళ్లంతా ఆరోజు డ్యూటీలో ఉండటం, మూడు పెట్రోలింగ్ వాహనాలు, రెండు పికెట్లతో గస్తీ కాస్తున్నా, అంజలి ప్రమాదం గురించి తెలియకపోవడంపై చర్యలు తీసుకుంది కేంద్ర హోంశాఖ. స్కూటీపై వెళ్తోన్న అంజలిని కారుతో ఢీకొట్టడమే కాకుండా, చక్రాల మధ్య ఇరుక్కున్న అంజలిని పట్టించుకోకుండా పన్నెండు కిలోమీటర్లు కారును నడపటం అనుమానాలకు తావిచ్చింది. పైగా అంజలి మృతదేహం పూర్తి నగ్నంగా రోడ్డుపై దొరకడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ ఇన్సిడెంట్‌లో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చెలరేగాయ్. 11మంది పోలీసులు, మూడు పెట్రోలింగ్ వాహనాలు, రెండు పికెట్లతో గస్తీ కాస్తున్నా.. డ్రంకన్ డ్రైవర్స్‌ని ఎందుకు గుర్తించలేదనే ప్రశ్నలు ఢిల్లీ ప్రజల నుంచి వచ్చాయ్. పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పెద్దఎత్తున ఆందోళనలు చేశారు ప్రజలు. జనాగ్రహంతో దిగొచ్చిన కేంద్ర హోంశాఖ, ఊహించనివిధంగా యాక్షన్ తీసుకుంది. ఆరోజు విధుల్లో ఉన్న పోలీసులందర్నీ సస్పెండ్‌చేసి షాకిచ్చింది. రోజుకో మలుపు తిరుగుతోన్న అంజలి డెత్ కేసులో ముందుముందు ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో మరి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..