Gold Price Today: పండుగ వేళ షాక్ కొడుతోన్న గోల్డ్ రేట్.. భారీగా పెరిగిన ధర. ఒక్కరోజులోనే ఏకంగా..
వరుసగా రెండు రోజులపాటు భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మళ్లీ భయపెట్టిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా రూ. 300కి పైగా తగ్గడంతో గోల్డ్ లవర్స్ కాస్త రిలాక్స్‌గా ఫీలయ్యారు. అయితే మళ్లీ ఒక్కసారిగా గోల్డ్ రేట్స్‌లో పెరుగుదల నమోదవుతోంది. జనవరి 12వ తేదీ నుంచి వరుసగా మూడు..
వరుసగా రెండు రోజులపాటు భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మళ్లీ భయపెట్టిస్తోంది. రెండు రోజుల్లో ఏకంగా రూ. 300కి పైగా తగ్గడంతో గోల్డ్ లవర్స్ కాస్త రిలాక్స్‌గా ఫీలయ్యారు. అయితే మళ్లీ ఒక్కసారిగా గోల్డ్ రేట్స్‌లో పెరుగుదల నమోదవుతోంది. జనవరి 12వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు బంగారం ధర పెరుగుతూనే ఉంది. తాజాగా బంగారం ధరలో భారీగా పెరుగుదల కనిపించింది. శనివారం దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో గోల్డ్ రేట్ పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 200 పెరిగి రూ. 51,600గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,290 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 51,600గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,290గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 57,250గా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 51,650 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 56,340 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,290 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరూ. 51,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,340 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 51,600 24 క్యారెట్స్ ధర రూ. 56,080గా ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
వెండి కూడా బంగారం దారిలోనే వెళ్తోంది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరల్లోనూ పెరుగదల కనిపించింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో శనివారం కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,000గా ఉంది. ముంబయిలో కిలో వెండి ధర రూ. 72,000 వద్ద కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెండి ధరలో మార్పు కనిపించలేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,000గా నమోదుకాగా, విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..