TVS IQube: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 145 మైలేజ్.. టీవీఎస్ నుంచి సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..
ఎలక్ట్రిక్ వాహనాల్లో ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ విషయంలో కొంచెం వినియోగదారులను నిరాశ పరుస్తున్నాయి. ఈ విషయంలో ఏ కంపెనీ కూడా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు టీవీఎస్ తన కొత్త మోడల్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఇటీవల ఆటో ఎక్స్ పో 2023 లో టీవీఎస్ ఐ క్యూబ్ ఎస్టీను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ వాయిస్ అసిస్టెన్స్ సిస్టమ్, అలాగే టైర్ ప్రెజరింగ్ మానిటర్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది.
పెరుగుతున్న ఇందన ధరల దెబ్బకు సామాన్యులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మధ్యతరగతి వారిని ఆకర్షించడానికి మోటార్ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ధర, మోడల్స్, ఫీచర్స్ ఇలా అన్ని రకాల్లో తమ మార్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల్లో ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ విషయంలో కొంచెం వినియోగదారులను నిరాశ పరుస్తున్నాయి. ఈ విషయంలో ఏ కంపెనీ కూడా దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు టీవీఎస్ తన కొత్త మోడల్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఇటీవల ఆటో ఎక్స్ పో 2023 లో టీవీఎస్ ఐ క్యూబ్ ఎస్టీను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ వాయిస్ అసిస్టెన్స్ సిస్టమ్, అలాగే టైర్ ప్రెజరింగ్ మానిటర్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ 4.56 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో పాటు 3కెడబ్ల్యూ మోటార్ తో శక్తిని పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లు, అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 145 కిలో మీటర్ల వరకూ వెళ్తుందని కంపెనీ పేర్కొంటుంది.
టీవీఎస్ ఐ క్యూబ్ మూడు వెర్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. స్టాండర్డ్, ఎస్, ఎస్టీ లో ప్రత్యేక ఫీచర్లతో వస్తుంది. ఆల్ ఓవర్ ఎల్ఈడీ లైటింగ్ దీని ప్రత్యేకత. టాప్ మోడల్ లో 4.56 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వస్తుంది. అయితే ఎస్, స్టాండర్డ్ మోడల్స్ లో 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కంపెనీ ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా టాప్ ఎండ్ వెర్షన్ లోనే అధునాత ఫీచర్లు ఉన్నాయి. మొబైట్ చార్జింగ్ కోసం యూఎస్ బీ కనెక్టర్, జియో ఫెన్సింగ్, దొంగతనం చేస్తే అలర్ట్ చేసేందుకు అలారం, టర్న్ బై టర్న్ నావిగేషన్, రైడ్ మోడ్ లు, ఫోన్ అలర్ట్, ఆడియో కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ లో బ్రేకింగ్ సిస్టమ్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. సింగిల్ ఫ్రంట్ డిస్క్ తో పాటు వెనుక వైపు డ్రమ్ యూనిట్ తో వస్తుంది. దీనికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్ తో డ్యుయల్ రియర్ షాక్ తో వస్తుంది. అలాగే ఈ బైక్ అలాయ్ వీల్స్ తో వస్తుంది. టీవీఎస్ ఐ క్యూబ్ డిసెంబర్ లో గణీనీయమైన సేల్స్ నమోదు చేశాయి. ఈ స్కూటర్ ముఖ్యంగా ఓలా ఎస్ 1, ఎథెర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్, హీరో విడా వి1 వంటి స్కూటర్లతో పోటీ పడుతుంది. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ హై ఎండ్ ధర కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం