Auto Expo 2023: భారత మార్కెట్‌లోకి తొలి హైడ్రోజన్ కార్.. లుక్, డిజైన్‌లో తగ్గేదేలే..
భారతదేశంలో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎంపీవీ. ఇతర దేశాల్లో మాక్సస్ యూనిక్ 7 గా అమ్ముడవుతున్న ఈ కార్ ను భారత మార్కెట్ లోకి ఎంజీ యూనిక్ ఫూయల్ సెల్ ఎంపీవీగా తీసుకువస్తుంది. ఈ మేరకు ఈ కార్ ను ఆటో ఎక్స్ పో 2023 లో లాంచ్ చేసింది.
ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ ఎంజీ తన కొత్త కార్ ను భారత మార్కెట్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ భారతదేశంలో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎంపీవీ. ఇతర దేశాల్లో మాక్సస్ యూనిక్ 7 గా అమ్ముడవుతున్న ఈ కార్ ను భారత మార్కెట్ లోకి ఎంజీ యూనిక్ ఫూయల్ సెల్ ఎంపీవీగా తీసుకువస్తుంది. ఈ మేరకు ఈ కార్ ను ఆటో ఎక్స్ పో 2023 లో లాంచ్ చేసింది. అలాగే మాక్సస్ యూనిక్ 7 కు భిన్నంగా దీని డీజైన్, ఫీచర్స్ ఉన్నాయి. అలాగే భారతదేశంలో పర్యావరణ హితంగా తమ కార్ ఉండబోతుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ కార్ లో ఉండబోయే ఐదు ప్రత్యేక ఫీచర్ల గురించి ఓ లుక్కెద్దాం.
ఎక్స్ టీరియర్
మొదటిసారి చూసినప్పుడు యూనిక్ 7 ఓ వ్యాన్ లా కనిపిస్తుంది. అయితే ఫ్రంట్ ఎండ్ లో మాత్రం స్లాట్డ్ గ్రిల్ ఆకర్షిస్తుంది. బంపర్ వద్ద ఉన్న ఎయిర్ డ్రమ్ లు కార్ కు స్పోర్టీ లుక్ తీసుకువస్తుంది. బిజీ అల్లాయ్ డిజైన్ అలాగే క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేసిన పెద్ద స్ట్రిప్ తో ఉన్న ఎల్ ఈడీ టెయిల్ ల్యాంప్ లు కార్ డిజైన్ కు భిన్నంగా, ఆకర్షనీయంగా ఉన్నాయి.
ఇంటీరియర్
ఈ కార్ లో క్యాబిన్ ఇతర ఎంజీ కార్లలానే డిజైన్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో మినిమలిస్ట్ లే అవుట్ తో ప్రీమియం లుక్ ను ఇస్తుంది. అలాగే డ్యాష్ బోర్డు నలుపు, నీలం రంగులతో సీట్లు, నీలం,గోధుమ రంగుతో ఆకర్షనీయంగా ఇంటీరియర్ ను డిజైన్ చేశారు. ఇతర ఎంపీవీల్లానే యూనిక్ 7 కూడా సీటింగ్ కెపాసిటీ మెరుగ్గా ఉంటుంది.
అదిరపోయే డ్రైవింగ్ ఫీచర్స్
యూనిక్ 7 లో డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమెట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ తో కీ లెస్ ఎంట్రీలు ఉన్నాయి. అలాగే సూపర్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ తో ప్రయాణికులు భద్రత మెరుగ్గా ఉంటుంది.
పవర్ ట్రైన్
యూనిక్ 7 యూఎస్ పీలో హైడ్రోజన్ ఇందన సెల్ ప్రవర్ ట్రైన్ తో పని చేస్తుంది. కారు బ్యాటరీ ప్యాక్ కు బదులుగా హైడ్రోజన్ ఇంధన కణాల నుంచి ఇంధనం డ్రాయింగ్ ఎలక్ట్రిక్ పవర్ తో నడుస్తుంది. అయితే దీన్ని ఓ సారి నింపితే దాదాపు 605 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.
ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
అయితే ఈ మోడల్ ను భారత్ లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనే విషయం కంపెనీ స్పష్టంగా పేర్కొనలేదు. ఎందుకంటే ఇండియాలో హైడ్రోజన్ ఫ్యూయల్ లభ్యత, మౌలిక సదుపాయాల నేపథ్యంలో స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అయితే ఈ కార్ కియా కార్నివాల్ కు గట్టి పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..