Ather Electric Scooter: బైక్ అంటే ఇలా ఉండాలి.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ట్రెండ్ సెట్టర్ అయిపోతుందేమో? ఫీచర్లు మామూలుగా లేవుగా..
ఇదే క్రమంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ తన 450 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ ను సరికొత్తగా విడుదల చేసింది . దీని కోసం అథర్ కమ్యూనిటీ డే అని పిలవబడే కస్టమర్ ఈవెంట్‌లో అప్‌డేట్‌లను ఆవిష్కరించింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పోటీ వాతావరణం నెలకొంది. ఈ కొత్త సంవత్సరం అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో తమ వేరియంట్లను అన్ని కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ తన 450 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ ను సరికొత్తగా విడుదల చేసింది . దీని కోసం ఏథర్ కమ్యూనిటీ డే అని పిలవబడే కస్టమర్ ఈవెంట్‌లో అప్‌డేట్‌లను ఆవిష్కరించింది. సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ (UI), కొత్త కలర్స్ లో అందుబాటులో ఉంచింది. అలాగే కొన్ని అదనపు ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. అవేంటో ఓ సారి చూద్దాం..
యూజర్ ఇంటర్ ఫేస్ అంటే..
ఏథర్ కంపెనీ తన ఎలక్ట్రిక్ వేరియంట్ 450లో కొత్తగా యూజర్ ఇంటర్ ఫేస్(యూఐ) ప్రవేశపెట్టింది. దీని వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఒకసారి గమస్తే.. Ather దీనిని AtherStack 5.0 అని పిలుస్తోంది. ఇది ఒక టచ్ స్క్రీన్ సిస్టమ్. బైక్ స్టార్ట్ చేసే ముందు బ్లూటూత్ కనెక్షన్‌లు, నావిగేషన్ వంటి ఎంపికలకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే వినియోగదారులు బండిని ఏ మోడ్లో వినియోగిస్తున్నారు, చార్జింగ్ వంటి వివరాలు ఈ డిస్ ప్లే లో కనిపిస్తాయి. అంతేకాకుండా, ఈ స్క్రీన్ బ్రైట్‌నెస్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇన్‌కమింగ్ కాల్ నోటిఫికేషన్‌లను పొందవచ్చు.
న్యూ వెక్టార్ గూగుల్ మ్యాప్స్..
ఈ బైక్ లో మరో అత్యాధునిక ఫీచర్ గూగుల్ వెక్టార్ మ్యాప్స్. దీని ద్వారా లైవ్ ట్రాఫిక్ ను చూడటంతో పాటు నావిగేషన్ చూడవచ్చు. యూజర్ల లోకేషన్, రైడింగ్ స్టైల్ ని ఇది రియల్ టైం లో మనకు చూపుతుంది. ఇలాంటి ఫీచర్ కలిగి ఉన్న ఏకైక ఈ-బైక్ ప్రపంచంలో తమ ఏథర్ 450 ఒక్కటేనని ఆ కంపెనీ ప్రకటించుకుంది.
ఆటో హోల్డ్..
ఇవిగాక మరో అధునాతన ఫీచర్ ఈ బండికి ఉంది. అదే ఆటో హోల్డ్. ఏదైనా ఏటవాలు రోడ్లపై వెళ్లేటప్పుడు స్కూటర్ వెనక్కి రావడం లేదా ముందుకు దూసుకెళ్లి పోకుండా ఈ ఆటో హోల్డ్ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
రెండు వేరియంట్లు.. నాలుగు రంగులు..
ఏథర్ స్కూటర్ 450 ప్లస్, 450 ఎక్స్ అనే రెండు వేరియంట్లలో వస్తోంది. అలాగే ట్రూ రెడ్, కాస్మిక్ బ్లాక్, సాల్ట్ గ్రీన్, లూనార్ గ్రే వంటి నాలుగు రంగుల్లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీనిలోని బ్యాటరీకి ఏథర్ కంపెనీ 5 ఏళ్లు లేదా 60,000 కిలోమీటర్ల వరకూ వారంటీ ఇస్తోంది.
ధరలు ఇలా..
ఢిల్లీ ఎక్స్ షోరూం లో ఏథర్ 450 ప్లస్ ధర రూ. 1.37 లక్షలు కాగా, ఏథర్ 450 ఎక్స్ ధర రూ. 1.60 లక్షలుగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..