Cheapest Electric Bikes: అతి తక్కువ ధర.. అదిరిపోయే ఫీచర్లు.. ఈ ఎలక్ట్రిక్ బైక్ మోడళ్లు అస్సలు మిస్ అవ్వొద్దు
దేశీయ ఆటోమోబైల్ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైక్ పరం పర కొనసాగుతోంది. దిగ్గజ బ్రాండ్లు, అత్యాధునిక ఫీచర్లతో వాటి వేరియంట్లను ఆవిష్కరిస్తున్నాయి. అయితే వాటి ధరలూ ఎక్కడో ఆకాశంలో ఉంటున్నాయి.

దేశీయ ఆటోమోబైల్ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైక్ పరం పర కొనసాగుతోంది. దిగ్గజ బ్రాండ్లు, అత్యాధునిక ఫీచర్లతో వాటి వేరియంట్లను ఆవిష్కరిస్తున్నాయి. అయితే వాటి ధరలూ ఎక్కడో ఆకాశంలో ఉంటున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి. ఒక వేళ ఉన్నా ఫీచర్లు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ బైక్ ఏది? మీరు తెలుసుకోండి.. ఈ కథనం మీ కోసమే..
జాయ్ ఈ బైక్..
జాయ్ ఈ బైక్ మాన్ స్టర్ అతి తక్కువ ధరకు లభిస్తుంది. దీని మార్కెట్ ధర రూ. 1,02,249 ఉంది. ఇది రెండు రంగుల్లో లభిస్తుంది. బైక్ కు ముందు వెనుక డిస్క్ బ్రేకులు వస్తాయి. అయితే ఒకసారి చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల మైలైజీ మాత్రమే ఇస్తుంది. దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది.
టార్క్ క్రటోస్..
మన దేశంలో చవకైన ధరలో లభించే బైక్ లలో టార్క్ క్రటోస్ ఒకటి. మంచి లుక్ లో తక్కువ ధరకు లభిస్తుంది. ఢిల్లీ ఎక్స్ షో రూంలో దీన ధర రూ. 1,19,753 నుంచి రూ. 1,35,764 వరకూ ఉంది. రెండు వేరియంట్లు, నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. ముందు వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. దీనిలో బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.
ఒడిస్సీ ఎవోకిస్..
దీని ధర దాదాపు రూ. 1,58,349 ఉంటుంది. ఇది ఐదు రంగుల్లో లభ్యమవుతుంది. ముందు వెనుక డిస్క్ బ్రేకులు ఉంటాయి. పూర్తిగా చార్జ్ చేస్తే 140 కిలోమీటర్లు వస్తుంది. గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. బ్యాటరీ పూర్తిగా చార్జ చేయడానికి ఆరు గంటల సమయం పడుతుంది.
రివోల్ట్ ఆర్ వీ 400..
ఢిల్లీ ఎక్స్ షోరూంలో దీని ధర రూ. 1,40,106 నుంచి 1,80,347 వరకు ఉంటుంది. ఇది రెండు వేరియంట్లు, మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. రివోల్ట్ ఆర్ వీ 400 బైక్ కి ముందు, వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి. పూర్తిగా చార్జ చేస్తే 150 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా చార్జ చేయడానికి 4 నుంచి 5 గంటలు పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..