Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhogi 2023: భోగి మంటలతో ఆరోగ్యం.. పిడకలు వేయడం వెనుక సైన్స్ రీజన్ ఏమిటో తెలుసా

ఒకప్పుడు భోగిమంటల్లో రావి, మామిడి, మేడి, వంటి ఔషధ చెట్ల బెరళ్లను, పాత కలప వేసేవారు. ఇవి బాగా మండేందుకు కొంచెం ఆవు నెయ్యిని జోడించేవారు. ఆవు పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. 

Bhogi 2023: భోగి మంటలతో ఆరోగ్యం.. పిడకలు వేయడం వెనుక సైన్స్ రీజన్ ఏమిటో తెలుసా
Bhogi Mantalu
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Jan 14, 2023 | 7:45 AM

తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా మూడు రోజుల పాటు జరుపుకునే పండగ. మొదటి రోజు జరుపుకునే పండగ భోగి. ఆధ్యాత్మిక పరంగా ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. భోగి అనే పదం.. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం అని అర్ధం. అంతేకాదు భోగం అంటే సుఖం అని అర్ధం. పూర్వం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగిపండగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాధ. భోగి రోజున పెద్దలు, పిల్లలు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటి ముందు మంటలను వేస్తారు. కొత్త బట్టలను ధరించి పిల్లలు భోగి పిడకలను వేస్తారు. ఇలా భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం. వాస్తవానికి హిందువులు జరుపుకునే ప్రతి పండగకు విశేష మైన అర్థాలు, ఉపయోగాలు, ఫలితాలు పెద్దలచే నిర్ణయింపబడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు భోగి రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారు? భోగి పిడకలు ఆ మంటల్లో వేయడం వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకుందాం..

భోగి అని ఎందుకు పిలుస్తారంటే.. 

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసంచలి మంటలు వేసుకునేవారు. అంతే కాదు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతిచేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు ‘భోగి మంటలు’.

ఇవి కూడా చదవండి

మంటల్లో ఔషధగుణాలు.. 

వాస్తవానికి ఈ భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. ఒకప్పుడు భోగిమంటల్లో రావి, మామిడి, మేడి, వంటి ఔషధ చెట్ల బెరళ్లను, పాత కలప వేసేవారు. ఇవి బాగా మండేందుకు కొంచెం ఆవు నెయ్యిని జోడించేవారు. ఆవు పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది ఆ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి.

పాతసామాన్లు వేయడం వెనుక రధం..

పాతసామాన్లు, చీపుళ్లు, ఎండుకొమ్మలు, విరిగిన వస్తువులు వంటి దారిద్య్ర చిహ్నాలని.. వాటిని మంటల్లో వేసి తగలబెట్టడం ఆనాటి ఆచారం. లేమి చీకట్లలోంచి భోగవికాసాల్లోకి దారిచూపే ఆ మంటల్ని ‘భోగిమంటలు’ అని వ్యవహరించేవారు. అయితే భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు. మనిషిలోని చెడు అలవాట్లు, చెడు లక్షణాలు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)