Fish Health: చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. చలికాలంలో మేలు చేస్తాయా.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..
శీతాకాలంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఎముకలు కొరికే చలిలో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో వివిధ సీజనల్ వ్యాధులు వెంటాడుతుంటాయి. శీతాకాలపు వ్యాధిని నివారించడానికి ఉత్తమ మార్గం మన రోగనిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడం, పోషకాహారాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.......
Updated on: Jan 14, 2023 | 7:49 AM

చలికాలంలో కాలానుగుణ వ్యాధులను నివారించడంలో చేపలు ఎంతోగానో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ ఆహారంలో చేపలను చేర్చుకుంటే అది ఆ పోషకాల లోపాన్ని తీరుస్తుంది. అయితే చేపల్లో ఒమేగా అధికంగా ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధులను తరిమికొడుతుందంటున్నారు.

ప్రస్తుత రోజుల్లో వెంటాడుతున్న వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు మంచి పోషకాలున్న ఆహారాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం. చేపలు తినడం వల్ల శరీరంలోని అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాన్ని తీరుస్తుంది. ఇది కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో ట్యూనా ఫిష్, సాల్మన్, మాకేరెల్ అవసరం.

చల్లని వాతావరణంలో చర్మ సమస్యలు పెరగడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో చర్మం పొడిగా మారుతుంది. అలాగే చర్మం గ్లో వచ్చేలా చేస్తుంది. చేపలలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 గ్లోను తిరిగి తీసుకురావడంలో సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఒమేగా-3 అధిక కొలెస్ట్రాల్‌పై ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు కూడా చాలా మేలు చేస్తాయి. దీన్ని తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఇది కాకుండా, ఇది శరీరం వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

చలికాలంలో తరచుగా దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యలు వెంటాడుతాయి. శ్వాస సంబంధిత సమస్యలలో కూడా ఇది తన ప్రభావాన్ని చూపుతుంది. ఒమేగా-3 శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.





























