బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన బాలయ్య ‘వీరసింహారెడ్డి’.. వెనుకబడ్డ తమిళ స్టార్ హీరోల మువీలు..!

నందమూరి నటసింహం బాలకృష్ణ, శృతి హాసన్‌ జంటగా నటించిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ మువీ..

బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన బాలయ్య 'వీరసింహారెడ్డి'.. వెనుకబడ్డ తమిళ స్టార్ హీరోల మువీలు..!
Veera Simha Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 14, 2023 | 8:26 AM

నందమూరి నటసింహం బాలకృష్ణ, శృతి హాసన్‌ జంటగా నటించిన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన ఈ మువీ తొలి రోజే రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఆల్ ఇండియా కలెక్షన్స్ 42 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 38.7 కోట్లు, కర్ణాటకలో 3.25 కోట్లు, ఓవర్సీస్‌లో కూడా 8 కోట్లు రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ తెరకెక్కించారు. ఇక గోపీచంద్‌ మలినేని జోడించిన మాస్‌ శైలి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.

సౌత్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ స్టార్ హీరోల సినిమాలు వరుసగా ధియేటర్‌లోకి వచ్చాయి. ఈ వరుసలో తమిళ స్టార్ హీరోలు అజిత్.. ‘తెగింపు’ మువీ, విజయ్ ‘వారసుడు’ మువీ తొలి రోజే బెస్ట్‌ కలెక్షన్లు రాబట్టినా.. బాలయ్య అభిమానుల ముందు బాక్సాఫీస్ వద్ద అంచనాలు తారుమారయ్యాయి. వారసుడు మువీ తొలిరోజు రూ.49 కోట్ల గ్రాస్ కలెక్షన్లురాగా. అజిత్ తెగింపు రూ.42 కోట్ల గ్లోబల్ కలెక్షన్స్ రాబట్టుకుంది. విజయ్, అజిత్‌లను వెనక్కి నెట్టి బాలయ్య మువీ ముందు వరుసలో దూసుకుపోతోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన తొలి సినిమాగా బాలయ్య వీర సింహారెడ్డి రికార్డ్ సృష్టించింది.

ఇవి కూడా చదవండి

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.