Swetha basu: ఆ క్యూట్, చబ్బీ లుక్స్ ఏమయ్యాయి ‘స్వప్న’.! అస్సలు గుర్తు పట్టలేనంతలా మారిన శ్వేత బసు, నెటిజన్లు షాక్
2002లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి శ్వేతా బసు ప్రసాద్. అనంతరం 2005లో తొలిసారి ఇక్బాల్ అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటించింది. ఇక తెలుగులో 2008లో కొత్త బంగారం లోకం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది..

2002లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి శ్వేతా బసు ప్రసాద్. అనంతరం 2005లో తొలిసారి ఇక్బాల్ అనే సినిమాలో లీడ్ రోల్‌లో నటించింది. ఇక తెలుగులో 2008లో కొత్త బంగారం లోకం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది అందాల తార. స్వప్న అనే పాత్రలో క్యూట్ యాక్టింగ్, చబ్బీ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. కాలేజీ కుర్రకారును తన డైలాగ్స్‌తో కట్టి పడేసింది. ఇదిలా ఉంటే అనంతరం పలు చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్న ఆశించిన స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయింది.
ఈ బ్యూటీ నటించిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయన్నే మూటగట్టుకున్నాయి. ఒక్క సినిమాతో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అంతే త్వరగా తెలుగు తెరకు దూరమైంది. 2018లో వచ్చిన విజేత చిత్రం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు శ్వేత. స్టార్ హీరోయిన్‌గా వెలుగుతుంది అనుకున్న ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇక మధ్యలో కొన్ని అనుకోని వివాదాలు సైతం శ్వేత కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. అటు సినిమా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో సినిమా అవకాశాలు లేక ఢీలా పడింది.



View this post on Instagram
ఇదిలా ఉంటే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇండియా లాక్‌డౌన్ అనే సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే శ్వేత పూర్తిగా మారిపోయింది. తాజాగా శ్వేత బసు ప్రసాద్ పుట్టిన రోజు వేడుకల్లో కనిపించిన ఈ బ్యూటీ అందరినీ షాక్‌కి గురి చేసింది. శ్వేతను చూసిన నెటిజన్లు ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. ఒకప్పుడు చబ్బీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరీ సన్నగా మారిపోయింది. దీంతో నెటిజన్లు అప్పటి ఆ అందంద ఏమైంది స్నప్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న శ్వేత మళ్లీ కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో సక్సెస్ కావాలని ఆశిద్దాం.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




