Waltair Veerayya: వీరయ్య వాల్తేరు వీరయ్య.. మెగాస్టారా మజాకా.. రిలీజ్ రోజే దిమ్మతిరిగే కలెక్షన్లు
చిరు అవతార్‌కు.. ఆయన మాస్ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేస్తున్నాయి. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. తాజాగా రిలీజైంది.

అందరూ అనుకున్నట్టే.. వీరయ్య పూనకాలు లోడయ్యాయి. అందరికీ దిమ్మతిరిగేలా చేశాయి. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. పండగ రోజుల్ని మరింత జోష్ ఫుల్ గా మార్చాయి. చిరు అవతార్‌కు.. ఆయన మాస్ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేస్తున్నాయి. ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా.. తాజాగా రిలీజైంది. రిలీజ్ అవ్వడమే కాదు.. పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. కలెక్షన్లను కుమ్మేస్తోంది.
ఇక అకార్డింగ్ టూ ఫిల్మ్ రిపోర్ట్ ఈ సినిమా మొదటి రోజే వరల్డ్ వైడ్ 50 క్రోర్ గ్రాస్ వసూలు చేసిందట. ఇండస్ట్రీ లోనూ ఇదే పుకార్. ఇక వాల్తేరు సినిమా అందరి అంచనాలకు మించేలా ఉండడం.. మెగాస్టార్ మాస్ విశ్వరూపాన్ని చాలా రోజుల తర్వాత ఈ సినిమా ఆవిష్కరించడంతో.. బెన్ ఫిట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. అది కాస్త మౌత్ టాక్ తో.. జనాలను థియేటర్ల వైపు నడిచేలా చేస్తోంది. బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెచ్చిపెట్టింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. చిరుతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి.




