Sankranti special 2023: సంక్రాంతి పండక్కి ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి 173 రకాల వంటకాలతో విందు
అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. ఇక ఇంటి అల్లుడు సంక్రాంతికి ఇంటికి వస్తే ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఈ సారి సంక్రాంతికి తమ ఇంటి కొత్త అల్లుడికి అత్తమామలు ఏకంగా 173 వంటకాలతో విందు..
అతిధి మర్యాదలకు పెట్టింది పేరు గోదావరి జిల్లాలు. ఇక ఇంటి అల్లుడు సంక్రాంతికి ఇంటికి వస్తే ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఈ సారి సంక్రాంతికి తమ ఇంటి కొత్త అల్లుడికి అత్తమామలు ఏకంగా 173 వంటకాలతో విందు భోజనం ఇచ్చారు. వివరాల్లోకెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపార వేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు రెండేళ్ల క్రితం తమ కుమార్తె హారికను పృధ్వి గుఫ్తాతో వివాహం జరిపించారు. ఐతే కరోనా కారణంగా పండగ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది సంక్రాంతికి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అల్లుడు, కూతురుని ఇంటికి పలిచి మర్యాదలు చేశారు అత్తమామలు. ముచ్చటగా మూడో ఏడాది అసలు, వడ్డీతో కలిపి అల్లుడికి పిండి వంటకాలు రుచి చూపించారు. ఎంతో ప్రేమగా అత్తమామలు వడ్డిస్తున్న 173 వంటలను తినడం కష్టమైనా.. అల్లుడుగారు ఇష్టంగానే అన్ని వంటకాలు రుచి చూశాడు. వారి మర్యాదలకు అల్లుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. గోదారోళ్లన్నాక ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే తర్వాత మాటరాదు..!
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.