President security breach: రాష్ట్రపతి ముర్ము పాదాలు తాకేందుకు యత్నించిన మహిళా ఇంజినీర్‌పై సస్పెన్షన్‌ వేటు

రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించిన మహిళా ఇంజనీర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రొటోకాల్‌ను అతిక్రమించి..

President security breach: రాష్ట్రపతి ముర్ము పాదాలు తాకేందుకు యత్నించిన మహిళా ఇంజినీర్‌పై సస్పెన్షన్‌ వేటు
Droupadi Murmu
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 15, 2023 | 8:33 AM

రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించిన మహిళా ఇంజనీర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రొటోకాల్‌ను అతిక్రమించి ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించిన పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మహిళా జూనియర్ ఇంజనీర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా జనవరి 3, 4 తేదీల్లో ముర్ము రాజస్థాన్‌లో పర్యటించారు. దీనిలో భాగంగా జనవరి 4న రోహెత్‌లోని స్కౌట్‌ గైడ్‌ జంబోరీ ప్రారంభ కార్యక్రమానికి ముర్ము హాజరయ్యారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వస్తున్న రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికేందుకు అధికారులు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పాదాలను తాకేందుకు జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్‌ ప్రయత్నించారు. ఐతే అక్కడే ఉన్న రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికను కోరింది. దీనిపై చర్యలు చేపట్టిన రాజస్థాన్‌ ప్రభుత్వం సదరు ఇంజినీర్‌ను సస్పెండ్‌ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దీనిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.