Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: ఈ జాదూగాడు మామూలోడు కాదు.. ఏకంగా రూ. 25లక్షల హోటల్ బిల్ ఎగ్గొటేశాడు..

హోట‌ల్ రూమ్‌లో ఉన్న అనేక సిల్వ‌ర్‌ ఐట‌మ్స్‌ను కూడా అత‌ను దొంగ‌లించిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు,..ఇలాంటి చీటింగ్‌ కేసుల్లో అతనిపై పలు రాష్ట్రాల్లో కూడా కేసులున్నట్టుగా సమాచారం.

Delhi: ఈ జాదూగాడు మామూలోడు కాదు.. ఏకంగా రూ. 25లక్షల హోటల్ బిల్ ఎగ్గొటేశాడు..
Leela Palace
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 17, 2023 | 3:37 PM

లగ్జరీ హోటల్‌లో ఎంజాయ్‌ చేసిన ఓ యువకుడు.. ఆ తర్వాత బిల్లు కట్టకుండానే దర్జాగా వెళ్లిపోయాడు. పైగా తమది ఓ రాయల్‌ కుటంబమని హోటల్‌ సిబ్బంది ఎదుట తెగ బిల్డప్‌ ఇచ్చుకున్నాడు.. అతగాడి మాటలను నమ్మిన హోటల్‌ సిబ్బంది.. అతడు ఉన్నాన్నాళ్లు మహారాజ సపర్యాలు చేశారు. ఆఖరుకు అతడు భారీగా బిల్లు ఎగ్గొట్టేసి పరారవటంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు హోటల్‌ నిర్వాహకులు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని లగ్జరీ హోటల్ లీలా ప్యాలెస్ నుంచి ఓ యువకుడు బిల్లు కట్టకుండా పారిపోయాడు. 23.46 లక్షల బిల్లు చెల్లించకుండా మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి పరారయ్యాడు. గతేడాది ఆగస్టు 1 నుంచి నవంబర్ 20 వరకు హోటల్‌లోనే బస చేశాడు మహ్మద్‌ షరీఫ్‌. అతను నకిలీ బిజినెస్‌ కార్డును ఉపయోగించి లీలా ప్యాలెస్‌లో దిగాడు.

హోట‌ల్‌లో చెకిన అయిన త‌ర్వాత తాను యూఏఈ రెసిడెంట్ అని సిబ్బందికి చెప్పాడు. అబుదాబి రాయ‌ల్ ఫ్యామిలీ షేక్ ఫ‌లాహ్ బిన్ జ‌యిద్ అల్ న‌హ‌య‌న్ ఇంట్లో ప‌నిచేస్తున్న‌ట్లుగా చెప్పి అందరినీ నమ్మించాడు. యూఏఈ రెసిడెండ్ కార్డు, బిజినెస్ కార్డు, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను అత‌ను హోట‌ల్‌లో చూపించాడు. త‌రుచూ హోట‌ల్ సిబ్బందితో మాట్లాడుతూ, వారిని ద‌గ్గ‌ర చేసుకున్నాడు. నాలుగు నెల‌లు హోట‌ల్‌లో ఉన్న ష‌రీఫ్‌కు 35 ల‌క్ష‌ల బిల్లు అయ్యింది. అత‌ను 11.5 ల‌క్ష‌ల బిల్లు చెల్లించాడు. మిగితా అమౌంట్ చెల్లించ‌కుండా అత‌ను పారిపోయాడు. న‌వంబ‌ర్ 20వ తేదీన సిబ్బందికి 20 ల‌క్ష‌ల చెల్ల‌ని చెక్కును ఇచ్చి వెళ్లిపోయాడు.

ఇవి కూడా చదవండి

నాలుగు నెల‌ల త‌ర్వాత న‌వంబ‌ర్ 20వ తేదీన అత‌ను హోట‌ల్ నుంచి క‌నిపించ‌కుండాపోయాడు. అయితే అత‌ను ఇచ్చిన డాక్యుమెంట్ల‌ను పోలీసులు త‌నిఖీ చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ వ్య‌క్తిని గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. హోట‌ల్ రూమ్‌లో ఉన్న అనేక సిల్వ‌ర్‌ ఐట‌మ్స్‌ను కూడా అత‌ను దొంగ‌లించిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు,..ఇలాంటి చీటింగ్‌ కేసుల్లో అతనిపై పలు రాష్ట్రాల్లో కూడా కేసులున్నట్టుగా సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..